ఆంధ్రప్రదేశ్‌

రూ.787 కోట్లతో అమృత్ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 8: మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన అమృత్ పథకాన్ని రాష్ట్రంలోని 25 పట్టణాల్లో 787 కోట్ల రూపాయలతో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం పట్టణాభివృద్ధి, పురపాలక శాఖపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ ప్రాజెక్టు కింద చిలకలలూరిపేట, మదనపల్లి, కర్నూలు, శ్రీకాకుళం, తిరుపతిలో 200 కోట్ల రూపాయలతో, మచిలీపట్నం, తాడేపల్లిగూడేం, గుంటూరు, రాజమహేంద్రవరం, గుడివాడ, ఒంగోలు, ఏలూరు, ధర్మవరం, గుంతకల్, నంద్యాలల్లో 171 కోట్ల రూపాయలు, విజయనగరం, తెనాలి, విశాఖ, నరసారావుపేట, కడప, ఆదోనిలకు 325 కోట్ల రూపాయలు, విజయవాడలో 325 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కింద ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే వేసవిలో ఏ పురపాలక సంఘంలోనూ మంచినీటి సమస్య తలెత్తకుండా ఇప్పటినుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులు వేసవి నాటికి పూర్తి కానున్నాయన్నారు. వచ్చే రెండేళ్లలో 1.2 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. తక్కువ సమయంలో తక్కువ వ్యయంతో గృహ సముదాయాలను పూర్తి చేసేందుకు వీలుగా డిజైన్లు రూపొందించాలన్నారు. ఇకపై ప్రభుత్వం నిర్మించే గృహ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. ప్రభుత్వం నిర్మించే టౌన్‌షిప్‌లు కేవలం నివాస ప్రాంతాలుగానే కాకుండా ఆర్థిక నగరాలుగా తీర్చిదిద్దాలన్నారు. జక్కంపూడి వద్ద నిర్మించిన గృహ సముదాయానికి సంబంధించి వివిధ అంశాలపై సర్వే నిర్వహించగా, ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. పట్టణాల సుందరీకణ పనులు చరుగ్గా జరుగుతున్నట్లు సిఎంకు అధికారులు వివరించారు. 243 కోట్ల రూపాయలతో అర్బన్ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఈ పనులను చేపడుతోందన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు 16 సంస్థలు ముందుకు వచ్చాయని, 41,790 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నారన్నారు. 1.5 లక్షల గృహాలు దీంతో అందుబాటులోకి రావడమే కాకుండా 2.08 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, అధికారులు పాల్గొన్నారు.