ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌టిఆర్ జీవితం ఒక తెరచిన పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 9: ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకం వంటిదని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. ఒంగోలులో ఎన్‌టిఆర్ కళాపరిషత్ జాతీయ నాటకోత్సవాలు గురువారం అట్టహాసంగా ముగిసాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి మాట్లాడుతూ ఎన్‌టిఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలను జాతీయస్ధాయిలో గత 18సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహించడం పట్ల ఆమె నిర్వాహకుడు ఈదర హరిబాబు, భరత్‌ను అభినందించారు. జానపద కళారూపాలను మనం కాపాడుకున్నప్పుడే మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకున్న వారవౌతామని ఆమె పేర్కొన్నారు. కంప్యూటీకరణ మోజులో పడి సంస్కృతీ సంప్రదాయాలు మరిచిపోకుండా వాటికి కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తనతండ్రి ఎన్‌టి రామారావు జీవితం ఒక తెరిచిన పుస్తకమని సాహసమే ఊపిరిగా నటనే జీవితంగా చేసుకుని ఎన్‌టిఆర్ జీవించారని తెలిపారు. ఎన్‌టిఆర్ సినిరంగంలోకి ప్రవేశించే నాటికి సినిమా రంగం అంటే వ్యససాలతో కూడిన రంగంగా పేరు ఉండేదని అయితే ఎన్‌టిఆర్, అక్కినేని నాగేశ్వరరావులు సిని రంగంలో ఒక క్రమశిక్షణగా నటించి చలనచిత్రరంగానికే వనె్న తీసుకువచ్చారని ఆమె తెలిపారు. నిలువెత్తు తెలుగుతేజం ఎన్‌టిఆర్ అని ఆమె కొనియాడారు. సమాజం కోసం నిస్వార్ధంగా సేవచేసేందుకు రాజకీయరంగంలోకి ప్రవేశించి రాజకీయాలకు అతీతంగా సేవచేసి మంచి పేరుప్రతిష్టలుపొందారని ఆమె కొనియాడారు.