ఆంధ్రప్రదేశ్‌

ఏసిబికి చిక్కిన ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, ఫిబ్రవరి 10: ఇ-పాసు పుస్తకం మంజూరుకు దరఖాస్తు చేసినది లగాయతు రోజుల తరబడి తిప్పడమే కాకుండా మంజూరైన పుస్తకాన్ని ఇచ్చేందుకు ముప్పతిప్పలు పెడుతూ లంచం డిమాండ్ చేసిన గ్రామ రెవెన్యూ అధికారిని ఓ రైతు ఎసిబి అధికారులకు పట్టించాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఒంగోలు ఎసిబి డివైఎస్పీ ఆర్‌విఎస్‌ఎన్ మూర్తి కథనం మేరకు మండలంలోని గంగదొనకొండ గ్రామానికి చెందిన పార్శపు ఆదిలక్ష్మమ్మ పేరిట ఆమె భర్త అంజయ్య రెండు దఫాలుగా అదే గ్రామంలోని సర్వేనెంబర్ 226/1లో 3.08 ఎకరాల సాగుభూమిని 2015లో కొనుగోలు చేశారు. సదరు భూమికి ఇ-పాసుపుస్తకం మంజూరు చేయాలని గత ఏడాది అక్టోబర్‌లో మీ-సేవా ద్వారా తహశీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామరెవెన్యూ అధికారి చెన్నకృష్ణయ్య అలియాస్ చిన్నకృష్ణయ్య పాసుపుస్తకం మంజూరు చేయడానికి 10వేల రూపాయలు డిమాండ్ చేశాడు. బేరసారాలు ఆడి 5వేల రూపాయలు ఇచ్చేలా అంజయ్య ఒప్పందం చేసుకున్నాడు. జనవరి 18వ తేదీ ఇ-పాసు పుస్తకం మంజూరై చెన్నయ్య నుంచి కురిచేడు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. డబ్బులు ఇస్తేకానీ పాసుపుస్తకం ఇవ్వనని విఆర్‌ఓ డిమాండ్ చేయడంతో అంజయ్య ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి డివైఎస్పీ తహశీల్దార్ కార్యాలయ సిబ్బందిపై నిఘా పెట్టి శుక్రవారం అంజయ్యనుంచి లంచం పుచ్చుకుంటుండగా రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. కాగా చిన్న కృష్ణయ్య ఇంటిలో కూడా ఎసిబి అధికారులు సోదాలు చేశారు. దాడి సమయంలో అతను ధరించిన షర్టును, నగదును సీజ్ చేశారు.