ఆంధ్రప్రదేశ్‌

క్రికెట్ బుకీ ఇంట్లో ఐటి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 10 : నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ సరస్వతీనగర్‌లో నివాసముంటున్న ఓ క్రికెట్ బుకీ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో అతని ఇంటిలో కోటి రూపాయల మేర నగదు నిల్వలను అధికారులు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎటువంటి లెక్కలు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు సమాచారం. అదేవిధంగా సదరు బుకీ కుటుంబ సభ్యుల పేరు మీద బ్యాంకులో జన్‌ధన్ ఖాతాలో మూడు కోట్లకు పైగా నగదును అధికారులు గుర్తించి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు. నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే సదరు వ్యక్తి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ నిర్వహంచే దాడులు సంచలనం సృష్టించాయి. సంబంధిత అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.