ఆంధ్రప్రదేశ్‌

మానసిక వికాసానికి సంగీతం ఓ సాధనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 10: మానసిక వికాసానికి సంగీతం ఎంతగానో తోడ్పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం సాయంత్రం పవిత్ర సంగమం వద్ద ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను ముఖ్యమంత్రి దీపారాధనతో ప్రారంభించి మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా పవిత్రమైన గోదావరి, కృష్ణమ్మ సంగమమైన పవిత్ర సంగమం వద్ద జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించడం, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకమన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని, సాయం సంధ్యవేళలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పవిత్ర సంగమం వద్ద హారతిని ఇస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందకరమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్యమంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విజయవాడలో శుక్రవారం సాయంత్రం అంతర్జాతీయ
సంగీతోత్సవాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు