ఆంధ్రప్రదేశ్‌

మహిళలు చైతన్యవంతులు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజి సర్కిల్), ఫిబ్రవరి 10:మహిళలకున్న శక్తి ప్రపంచంలో మరెవరికీ లేదని, అసాధ్యమనుకునే వాటిని సుసాధ్యం చేసే శక్తి వారికే ఉందని పలువురు మహిళా ప్రతినిధులు పేర్కొన్నారు. మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిలో చైతన్యాన్ని నింపేందుకు జాతీయ మహిళా పార్లమెంటు వంటి సదస్సులు ఉపయోగపడతాయని, సదస్సులు కేవలం చర్చలకే పరిమితం కారాదని అభిప్రాయపడ్డారు. సదస్సులో దేశ, విదేశాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మహిళలు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు.

ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వాలదే!
నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనీ, పల్లె ప్రాంతాల్లో ఉన్న వారిని మరింత చైతన్య పరిచి వారు కూడా భాగస్వాములను చేసే బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే భావనా గౌడ్ అభిప్రాయపడ్డారు. ఆప్ ప్రభుత్వం మహిళల రక్షణ, వారి స్వావలంబన కోసం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. వితంతువులు, వృద్ధ మహిళలకు అందించే పింఛన్ మొత్తన్ని త్వరలోనే పెంచబోతున్నామని ప్రకటించారు.
ఏదీ సులభంగా రాదు..
‘మహిళలకు దేనినైనా సాధించే శక్తి ఉంది. దానికోసం కృషి చేయాల’ని కెన్యా నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాయిస్ చినోనా లబోశో పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత మరింత పెరగాలన్నారు. ‘కెన్యాలో మహిళా భాగస్వామ్యం 20 శాతం మాత్రమే ఉంది. దానిని 40 శాతానికి తీసుకు వెళ్తాం. మహిళా అక్షరాస్యత కూడా 70 శాతం పెరిగేందుకు ప్రణాళికలు రూపొందించాం’ అని ఆమె తెలిపారు. ఈ సదస్సు మహిళా అభ్యున్నతికి సహాయ పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
వినూత్న అలోచనలకు వేదిక
మహిళలు వారిలో దాగి ఉన్న అలోచనలను ఈ వేదిక ద్వారా వ్యక్త పరిచి మరింత మందికి ఆదర్శంగా నిలవాలని మాజీ ఎంపి చెన్నుపాటి విద్య పిలుపునిచ్చారు. వాటిని కార్యరూపం దాల్చేందుకు కూడా మహిళలు ప్రయత్నించాలనీ, మహిళలపై పేరుతున్న దాడులు నియంత్రించాలనీ ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో అమోదానికి అందరూ సహకరించాలని డిమాండ్ చేశారు.