ఆంధ్రప్రదేశ్‌

రేపిస్టులకు 20 ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 11 : మహిళపై అత్యాచారం, దాడి కేసులో ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి చెందిన నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రెండువేలు జరిమానా విధిస్తూ సోమవారం చిత్తూరు జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి సిదానంద తీర్పునిచ్చారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పాతగుంట ఎస్టీ కాలనీకి చెందిన రాజేంద్ర 2013 డిసెంబర్ 16న తనకు పరిచయం ఉన్న వివాహితతో కలిసి పెనుమూరు మండలం రామకృష్ణాపురం వద్దకు వచ్చారు. అక్కడ వీరు ఇరువురు ఏకాంతంగా ఉండగా తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన మణికంఠ (32), మురుగన్ (33), ప్రేమకుమార్ దాడి చేసి చెట్టుకు కట్టేసి మహిళపై అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా హింసించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారు నగలతో పాటు సెల్‌ఫోన్ తీసుకొని పారిపోయారు. రాజేంద్ర ఈ ఘటనలపై పెనుమూరు పోలీసుకు ఫిర్యాదు చేశారు. అప్పటి సిఐ వెంకట నారాయణ కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైన మహిళ మానసిక వేదనకు గురై కొద్ది రోజులకు ఆత్మహత్యకు పాల్పడింది. నిందితులు సంఘటనా స్థలం వద్ద నుంచి తీసుకెళ్లిన సెల్‌ఫోన్‌లోని సిమ్ కార్డును వినియోగించడంతో దీని ద్వారా పోలీసులు వీరిని గుర్తించి అరెస్టు చేశారు. ఇందులో ప్రేమకుమార్ అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. మిగిలిన ఇద్దరు మహిళపై అత్యాచారానికి పాల్పడటం, దాడి చేసినట్లు రుజువైంది. దీంతో వీరిరువురికి 20 ఏళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రెండు వేలు చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. అదే సంవత్సరం పలమనేరు అటవీ ప్రాంతంలో కానిస్టేబుల్‌ను, హోమ్‌గార్డును హత్య చేసిన కేసులోను వీరు నిందితులు.