రాష్ట్రీయం

ప్రాంతీయ పార్టీలతో ఇదే చిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: ప్రాంతీయ పార్టీలతో ఇదే చిక్కు అని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడైనా ఏక వ్యక్తి పాలన ఉంటుందని, ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే సంక్షోభం తలెత్తుతుందని ఆయన శుక్రవారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడుతూ అన్నారు. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలోనూ అదే జరిగిందని ఆయన తెలిపారు. అయితే తమిళనాడులో ఇది కొత్తేమి కాదని, గతంలోనూ ఇటువంటి సంక్షోభాలు తలెత్తాయని, సమిసిపోయాయని ఆయన చెప్పారు. లోగడ అన్నా దొరై, ఎంజి రామచంద్రన్ మృతి చెందిన సమయంలోనూ సంక్షోభంలో తలెత్తాయి, కొంత కాలానికి సద్దుమణిగాయి అని ఆయన తెలిపారు. ఇప్పుడు కూడా రాజకీయ ఉత్కంఠ, ఉద్రిక్త వాతావరణం నాలుగు రోజులు ఉన్నా, కాలక్రమేణా సంక్షోభం సద్దుమణుగుతుందని అన్నారు. ఎమ్మెల్యేల సంపూర్ణ మెజారిటీ ఎవరికి ఉన్నా, ఏ పార్టీకి ఉన్నా ఆ పార్టీని లేదా గ్రూపును ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన తెలిపారు. అది రాజ్యాంగ ధర్మం కూడా అని అన్నారు. ఆ దిశగా ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. ఈ సమయంలో మీరు గవర్నర్ ఉండి ఉంటే, మీ నిర్ణయం ఎలా ఉండేది? అని ప్రశ్నించగా, తాను లేను కాబట్టి ఆ ప్రశే్న ఉత్పన్నం కాదని ఆయన సమాధానమిచ్చారు. అయితే ఎవరు గవర్నర్‌గా ఉన్నా రాజ్యాంగం ప్రకారం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇందులో అనుమానాలకు, అపొహలకు తావు లేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్టప్రతి పాలన అనివార్యమని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా, ఊహజనితమైన ప్రశ్నలెందుకని డాక్టర్ కె. రోశయ్య ఎదురు ప్రశ్నించారు. శశికళతో తనకు పరిచయం లేదని, ఎప్పుడైనా జయలలితతో రాజ్‌భవన్‌కు వచ్చేదని, అప్పుడు నమస్కారం పెట్టేవారని, అంత వరకే ముఖ పరిచయమని ఆయన చెప్పారు.