ఆంధ్రప్రదేశ్‌

దేశం ఐదేళ్లు వెనక్కి పోయంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 10: దేశ ప్రధాని నరేంద్రమోదీ ఏక పక్షంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశం ఆర్థికంగా ఐదేళ్లు వెనక్కి వెళ్లటంతో పాటు, లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఎఐసిసి కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా పేర్కొన్నారు. ఎపిసిసి ఆధ్వర్యంలో గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లోని ఇందిరమ్మ ప్రాంగణంలో జన ఆవేదన సదస్సు ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపొందేందుకే బిజెపి నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ నిర్ణయంతో అభివృద్ధిలో దేశం ఐదు సంవత్సరాలు వెనుకబడి పోయిందన్నారు. పార్టీ కార్యకర్తలు మండల స్థాయి నుండి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి 2019 ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నోట్ల రద్దు వ్యితిరేక కమిటీ దక్షిణాది రాష్ట్రాల కో ఆర్డినేటర్ డికె శివకుమార్ మాట్లాడుతూ ప్రజలు నోట్ల రద్దు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఏటిఎంల వద్ద, బ్యాంకు బారులు తీరి నిలబడి 150 మందికి పైగా మృతిచెందారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తుందన్నారు. దేశ చరిత్రలో నోట్ల రద్దు ఓ చారిత్రాత్మక తప్పిదమన్నారు. అన్ని వ్యవస్థలు కుప్పకూలి పోవడంతో పాటు కోటి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారన్నారు. పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్యలు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు మార్చి 10వ తేదీలోగా మండల స్థాయి నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మార్చి 15న రాష్టవ్య్రాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా పార్లమెంటు సదస్సుకు ఇతర దేశాల నుండి మహిళలను తెచ్చుకునే దుస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందన్నారు. సాక్షాత్తు డిజిపియే రాష్ట్రంలో మహిళలపై గతంలో కంటే 11 శాతం దాడులు పెరిగాయని చెప్పడంలోనే శాంతి భద్రతల పరిరక్షణ ఎలా ఉందో అర్ధమవుతోందన్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్, జెడి శీలం, పనబాక లక్ష్మి, కె కృపారాణి, పిసిసి కార్యదర్శులు రుద్రరాజు, బాలరాజు, జిల్లా, నగర అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు, మాదా వెంకట ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..జన ఆవేదన సదస్సులో ప్రసంగిస్తున్న ఏఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా