ఆంధ్రప్రదేశ్‌

ప్రతిభావంతుల్ని ప్రోత్సహిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 11: ప్రతిభకు పేదరికం ఏనాడూ అడ్డురాదని నిరూపించి, వారి వారి రంగాల్లో ప్రతిభాసంపన్నంగా ముం దుకు సాగుతున్న విద్యార్థినీ, విద్యార్థులను గుర్తించి, ప్రోత్సహించడం సమాజంలోని అందరి కర్తవ్యమని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం రాత్రి గుంటూరులోని హిందూ కళాశాల ఏకాదండయ్య పంతులు హాలులో వేదవ్యాస విద్యా విజ్ఞాన వారధి, తరణి సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యాన 80 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా, ఉపకార పారితోషికాలను మంత్రి పుల్లారావుతో సహా పలువురు ప్రముఖులు అందజేశారు. సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్ లక్ష్మణ్ నిర్వహణలో జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పుల్లారావు మాట్లాడుతూ సంస్కారవంతమైన విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరూ ప్రతిభావంతులేనని, వారందరినీ ఎంపిక చేసి ఒకచోటకు చేర్చి పారితోషికాలను సంస్థ స్థాపించిన నాటి నుండి అందజేస్తున్న వేదవ్యాస విద్యా విజ్ఞాన వారధి, తరణి సంస్థల వారిని అభినందించారు. సమాజానికి ద్విగుణీకృతమైన సేవలందించిన పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారుల సలహా, సంప్రదింపులతో ప్రారంభించబడిన ఈ సంస్థలు సామాజిక సేవా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. సేవాభావాలు కల్గిన విజ్ఞాన వారధికి 5 లక్షల రూపాయల విరాళాన్ని అందజేస్తానని ప్రకటించారు.
మూలాలను మరువకూడదు
గౌరవ అతిథి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ 2008లో ఈ సంస్థ సమున్నత ఆశయాలతో ప్రారంభించబడిందని, ఇప్పటివరకు ప్రతిభావంతులైన అనేక మంది విద్యార్థులను ఎంపిక చేసి పారితోషికాలను అందిస్తూనే ఉందన్నారు. ఉపకార వేతనాలు స్వీకరించి తమ జీవితాలకు బాటలు వేసుకుని, ఉన్నత స్థానాల్లో స్థిరపడిన తర్వాత మూలాలను మరచిపోకుండా తోటివారికి సాధ్యమైన మేర సాయపడాలని ఉద్బోధించారు.

చిత్రం..విద్యార్థినికి ఉపకార వేతనం అందజేస్తున్న ప్రత్తిపాటి, ఐవైఆర్ తదితరులు