ఆంధ్రప్రదేశ్‌

ముంపు గ్రామాల్లోహక్కులకమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఏప్రిల్ 11: పోలవరం ప్రాజెక్టు కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం సోమవారం పర్యటించింది. అధికార్లు తమను ఇబ్బంది పెడుతున్నారని రామయ్యపేట, పైడిపాక, చేగొండిపల్లి, దేవరగొంది గ్రామ నిర్వాసితులు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆర్థిక వేత్త పెంటపాటి పుల్లారావు ద్వారా జాతీయ మానవ హక్కుల సంఘానికి చేసిన ఫిర్యాదు మేరకు ఇద్దరు సభ్యుల బృందం పర్యటన జరిపింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంద్రజిత్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ రణభీర్‌సింగ్ ఉదయం పదిగంటలకు మొదట రామయ్యపేట చేరుకుని, సర్పంచ్ సంకురు వెంకాయమ్మతో మాట్లాడారు. దేవరగొంది, చేగొండపల్లి నిర్వాసితులతో సంఘం సభ్యులు మాట్లాడారు. తమ గ్రామాలకు విద్యుత్, నీటి సౌకర్యం నిలుపు చేశారని, ఖాళీ చేయాలని పోలీసులతో ఒత్తిడి తెస్తున్నారన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటామని చెప్పినందుకు తమపై కేసు బనాయించారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.అనంతరం రామయ్యపేట చేరుకుని అక్కడ నిర్మించిన గృహాలను పరిశీలించి వివరాలను జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, హౌసింగ్ పిడి శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు.