ఆంధ్రప్రదేశ్‌

తిరుమలకు అంధుల పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 11: కళ్లు తెరచినా, మూసినా చీకటిని మాత్రమే చూడగలిగే అంధులు వారు. అయినా దేవునిపై ఉన్న భక్తి, తమపై తమకు ఉన్న ఆత్మవిశ్వాసంలో సకలాంగులకు ఏమాత్రం తీసిపోరు. అదే మొక్కవోని దీక్ష, దక్షలతో కోనేటిరాయుడ్ని తమ మనోనేత్రంతో చూసి తరించేందుకు పాదయాత్రగా బయల్దేరారు. ఒకరికొకరు చేదోడుగా నెల్లూరు నగరం నుండి శనివారం వేకువజామున తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. నెల్లూరుకు చెందిన అంజనా రూరల్ డెవలప్‌మెంట్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడైన శివకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్రలో 28 మంది అంధులు ఆయన వెంట తిరుమలకు బయల్దేరారు. వీరిలో చిన్నారులు కూడా ఉండడం విశేషం. ఈ సందర్భంగా శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ తాను అంధుడిగా ఉంటూ కూడా డాక్టరేట్ సాధించానని, అదే స్ఫూర్తితో అంధులుగా ఉండి ఏమీ సాధించలేమనుకునేవారికి తోడుగా నిలవాలని నిశ్చయించుకున్నానని తెలిపారు. అందులో భాగంగా ఆర్గనైజేషన్ స్థాపించి మరెందరో అంధులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాని తెలిపారు. తన వద్ద విద్యనభ్యసించన అంధుల్లో తొమ్మిది మంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల క్రితం స్థాపించిన తమ ఆర్గనైజేషన్ ధేవదేవుని ఆశీస్సులు కోరుతూ ఈ పాదయాత్ర చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట అంజనా రూరల్ డెవలప్‌మెంట్ ప్రతినిధి నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.

బయోటెక్నాలజీ
పరిశ్రమలను ఆకర్షించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమలను ఆకర్షించేందుకు వీలుగా పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్టాన్‌ఫర్డ్ వర్శిటీ నిపుణుడు, ఎపి బయోటెక్నాలజీ నిపుణుల సంఘం అధ్యక్షుడు సంజయ్ మల్‌హోత్రా అభిప్రాయపడ్డారు. గీతం బయోటెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోటెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని, దీనిలో భాగంగానే గీతం యూనివర్శిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సిఒఇ) ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. గీతం జీవశాస్త్ర విభాగాలు, బయోటెక్నాలజీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ మధ్య సమన్వయంతో పరిశోధనలను వేగవంతం చేయాలన్నారు.
చారు. గీతంలో జరిగే పరిశోధనలకు స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ సహకారం అందిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సువిశాల తీర ప్రాంతం ఉందని, వ్యవసాయ ఉత్పత్తులను, ఔషధ మొక్కలను సరైన విధానంలో అధ్యయనం చేయడం ద్వారా పారిశ్రామికంగా బయోటెక్నాలజీ రంగంలో ప్రగతి సాధించవచ్చన్నారు. పరిశోధనలను పేటెంట్ దిశగా కొనసాగించడం, వాణిజ్య అవసరాలకు తగిన విధంగా పరిశోధన ఫలితాలను పరిశ్రమలకు అందించడంపై విశ్వవిద్యాలయాల పరిశోధకులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

టాస్క్ఫోర్స్‌పై స్మగ్లర్ల రాళ్ల దాడి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 11: శేషాచలం అడవుల్లో శనివారం కూంబింగ్ జరుపుతున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్లు రాళ్లు, నాటుతుపాకీలతో దాడి చేశారు. చంద్రగిరికి సమీపంలోని కల్యాణి డ్యాం నుంచి 7కిలోమీటర్లు దూరంలోని గుర్రప్పగారి పల్లికి సమీప అటవీ ప్రాంతమైన ఊటనీరు ప్రాంతంలో టాస్క్ఫోర్స్ సిబ్బందికి కూంబింగ్ నిర్వహిస్తుండగా నాటు తుపాకులు, కత్తులు, రాళ్లతో 30 మంది స్మగ్లర్లు వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ రుకేష్ కాలికి గాయమైంది. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆత్మరక్షణార్థం మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వెనెక్కి తగ్గిన స్మగ్లర్లు అడవిలోకి పరారయ్యారు. ఈక్రమంలో 70 శ్రీగంధం చెక్కలు, 6 ఎర్రచందనం దుంగలు, రెండు నాటుతుపాకులు నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.