ఆంధ్రప్రదేశ్‌

సోషల్ మీడియా ప్రామాణికమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12: వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్‌ల ఆధారంగా ఆమెను జాతీయ పార్లమెంటు సదస్సుకు హాజరుకాకుండా ముందస్తుగా అరెస్టు చేసినట్లు ప్రభుత్వం, డిజిపి ప్రకటించడాన్ని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వానికి పాలనలో సోషల్ మీడియా ప్రామాణికమా అని నిలదీశారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైసిపి కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతీరోజూ తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులకు వ్యతిరేకంగా అనేక వ్యాఖ్యలు చేస్తారని, వారందర్నీ అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. రోజా అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ సదస్సుకు ఒక మహిళా ఎమ్మెల్యేను ఆహ్వానించి, అవమానించడం తగదన్నారు. రోజా అరెస్టుపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యా దు చేయడంతో పాటు, న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు.