ఆంధ్రప్రదేశ్‌

మహిళా బిల్లుపై ఎందుకు మాట్లాడరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 12: అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో మహిళా బిల్లుపై మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెరాస ఎంపి కవితలు పార్లమెంటులో ఇదే బిల్లుపై ఎందుకు ప్రస్తావన తీసుకురావడం లేదని సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి బివి రాఘవులు ప్రశ్నించారు. నెల్లూరు నగరంలో ఆదివారం ‘నూతన ఆర్థిక విధానాల అమలు- ఉద్యోగులు, కార్మికులు, ప్రజలపై ప్రభా వం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రధాన వక్తగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభల బయట మాత్రమే మహిళా బిల్లు గురించి ఉపన్యాసాలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 25 ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యానికి జరిగిన హాని ప్రధాని నరేంద్ర మోదీ రెండున్నర ఏళ్లలో చేసేశారన్నారు. నోట్ల రద్దు విషయంలో క్యాబినెట్‌తో కానీ, రిజర్వ్‌బ్యాంక్‌తో కాని చర్చించకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రధాని అపహాస్యం చేశారని మండిపడ్డారు. నోట్ల రద్దు వల్ల 90 శాతం చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు ఎంతో నష్టపోయాయని అన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన విషయాలను మంత్రిమండలిలో చర్చించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా మోదీ సిద్ధాంతానే్న అనుసరిస్తూ రాష్ట్రం లో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. శాసనసభలో ప్రజావసరాలపై చర్చ జరగడం లేదన్నారు.