ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 12: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు లౌకిక శక్తులతో కలిపి వామపక్షాలు పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి ఇక్కడ అమర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంస్కరణలు, లౌకికవాదం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర అంశాలపై పోరాటం సాగిస్తామన్నారు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి గురించి మాట్లాడుతూ అక్కడ బిజెపి తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. అందువల్లనే అక్కడ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు అన్ని తెలిసిన ఏ నిర్ణయం తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. కేవలం కేంద్రం చేతిలో కీలు బొమ్మలా వ్యవహరించడం వల్ల అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తిందని పేర్కొన్నారు. అక్కడ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేసిన వెంటనే దానిని ఆమోదించి హౌస్ ఆఫ్ అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునే అవకాశం కల్పించి ఉంటే ఇటువంటి సంక్షోభం తలెత్తేది కాదన్నారు.
దీని ఫలితంగా అక్కడ ప్రజానీకానికి 15 రోజులుగా అటు గవర్నర్ పాలనగానీ, ఇటు ముఖ్యమంత్రి పాలన లేకుండా పోయిందని ఆయన దుయ్యబట్టారు. ఇళ్లు కాలిపోతుంటే చుట్టముట్టించుకొని చూసే చందంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు.