ఆంధ్రప్రదేశ్‌

మహిళా సాధికారతకు మరింతగా కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 12: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, అయితే మహిళా సాధికారతకు మరింత కృషి జరగాలని పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో భాగంగా మూడవ రోజైన ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఇందుకు ఉదాహరణ తానేనని, ఒక సాధారణ గృహిణిగా ఉన్న తనకు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా తన భర్త మరణానంతరం రాజకీయాల్లోకి తీసుకువచ్చి మరోధైర్యంతో ముందుకు నడిపిస్తున్నారని ఆమె తెలిపారు. శాసన సభ్యురాలు అయిన అనంతరం అత్యంత బాధ్యతాయుతమైన పౌర సరఫరాల శాఖను తనకు అప్పగించి పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ శాఖాపరమైన బాధ్యతలతోపాటు ప్రజల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ముందుంటానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆస్తిలో మహిళలకు సగభాగం హక్కు క ల్పించారని ప్రస్తు తం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్టమ్రంతటా నిరుపేద మహిళలకు దీపం కనెక్షన్లు ఇస్తున్నామని తెలిపారు. మహిళలు సమర్ధవంతంగా పదవుల ను, బాధ్యతలను వారే నిర్వహించగలరని తెలిపారు. సైన్యం, రక్షణ దళాలకు సంబంధించిన విభాగాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిపేరు తీసుకురావాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు సేవాగుణం అలవరిచి మనోధైర్యంతో ముందుకు వెళ్ళేలా ఆడ, మగ బేదభావం లేకుండా పిల్లలను పెంచి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు.

చిత్రం..మంత్రి సునీత