ఆంధ్రప్రదేశ్‌

మన పని ద్వారానే మనమేమిటో నిరూపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముందు కార్పొరేట్ రంగంలో పని చేసి ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఓ ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నా. అప్పుడు ‘విండోస్’,‘బిల్‌గేట్స్’తో పని చేస్తే ఇప్పుడు విండోస్, గేట్స్ లేని సామాన్య ప్రజలకోసం పనిచేస్తున్నా. మహిళలు తమకు ఇష్టమైన రంగాన్ని ఎన్నుకుని దానిపైనే శ్రద్ధగా పనిచేస్తే తప్పక రాణిస్తారు.ఇతర విషయాలపైనా అవగాహన పెంచుకుని అవసరమైనప్పుడు అందులోనూ పనిచేయగల నేర్పు ఉండాలి. మన పని ద్వారానే మనమేమిటో నిరూపించుకోగలగాలి. వైఫల్యాల గురించి భయపడకూడదు. సమస్యలపై కన్నా వాటి పరిష్కారాలపైనే ఎక్కువ దృష్టిసారించాలి. కూతుళ్లను కాదు కొడుకుల్ని స్రీవాద దృక్పథంతో పెంచాలి.
పవినీషా నీరో (ఎమ్మెల్యే, కర్నాటక)

మన నిర్ణయాల్ని బట్టే
సమాజంలో మనకు గుర్తింపు
పశైలజా కిరణ్ (ఎండి, మార్గదర్శి)
నేనెలా వుండాలి అనే వెదుకులాటగా గాక నేనిలా వుండాలి అనే ఓ మార్గనిర్దేశంతో ముందుకుసాగాలి. సమాజం నినె్నలా గుర్తుంచు కోవాలనుకుంటున్నావో అది నీ చేతుల్లో, చేతల్లోనే ఉంది. మనం ఏంచేయాలనుకుంటున్నామో, ఎలా చేయాలనుకుంటున్నామో, ఫలితం ఏమి ఆశిస్తున్నామో నిర్ణయించుకుని ముందంజ వేయాలి.మనం జీవించి ఉన్నప్పుడు మంచిగా అనుకునేలా మరణానంతరం కూడా అంతకన్నా గొప్పగా చెప్పుకునేలా మన నడవడిక ఉండాలి.ఆ రకమైన ఆలోచనతోవుంటే ప్రతి వ్యక్తిలోనూ ప్రతికూల భావనలు తగ్గి సానుకూల దృక్పథం పెంపొందుతుంది.నా 29 ఏటనే మార్గదర్శి బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ముందుగా కొంచెం జంకినా తర్వాత స్థిర చిత్తంతో ఓ నిర్ణయం తీసుకుని, సమష్టి కృషితో విజయపథంలో పయనించగలుగుతున్నా.

సంప్రదాయాలు, కట్టుబాట్లు
స్ర్తిని బానిసగా మార్చాయి
పమాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ
మన సంప్రదాయాలు, కట్టుబాట్లు పురుషుడికి స్ర్తిని బానిసగా మార్చాయని సినీనటి జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మహిళా సదస్సులో ఆమె మాట్లాడుతూ చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధుల విధుల్లో భర్తల జోక్యం విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష దూరమైనప్పుడే అసలైన సాధికారత సాధ్యమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 12 శాతం మంది మహిళలే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం శోచనీయమన్నారు. భారత్ కంటే సౌదీ లాంటి దేశాల్లోనే మహిళల ప్రాతినిధ్యం ఎక్కవ ఉందన్నారు. సమాన హక్కులు అనేవి కోటాలు, రిజర్వేషన్ల వల్ల రావని, రాజ్యాంగం కల్పించిన హక్కుని మనమే తీసుకోవాలని జయసుధ సూచించారు.

లక్ష్య సాధనలో
స్థిరచిత్తంతోముందుకెళ్లాలి
పసలోని సిదాన (సబ్ కలెక్టర్)
చదరంగంలో కింగ్ కన్నా క్వీనే పవర్‌ఫుల్. మనదేశానికి భారతమాతగా, ఆంధ్రాలో తెలుగుతల్లిగా గుర్తింపువుండడాన్ని బట్టి స్ర్తికి ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతుంది.లక్ష్యం నెరవేరే వరకు నిదురపోనివ్వనిదే నిజమైన కల. జీవితంలో ఆటుపోటులు వస్తే అందుకు కారణాలేమిటో తెలుసుకుని వాటి పరిష్కరించుకోవాలి.
ఒక్కోసారి మన ఇంటినుంచే అనేక అవరోధాలు రావచ్చు. మన లక్ష్యం మంచిదైతే స్థిరచిత్తంతో ముందుగు సాగాలి. స్ర్తిలు ఎమోషనల్‌గా, సెన్సిటివ్‌గా వుండడం లోపంగా భావించకూడదు. అయితే అవి శ్రుతిమించకుండా చూసుకోవడంలోనే నేర్పరినం ఉంటుంది.

స్ర్తిల ప్రాతినిధ్యం లేని
దేశ ప్రగతి కుంటుపడుతుంది
పజాయ్‌సీ లెబోసా (డిప్యూటీ స్పీకర్, కెన్యా)
స్ర్తిల ప్రాతినిధ్యం లేకుంటే ఆ దేశ ప్రగతి కుంటుపడుతుందని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఒకప్పటికన్నా కెన్యా చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది. అయితే డిప్యుటీ స్పీకర్‌గా ఓ మహిళ ఎన్నికకావడం నాతోనే ప్రారంభమైంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని మహిళలు ముందుగు సాగాలి. మార్గాన్ని నిర్దేశించుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, స్థిరాభిప్రాయాలు కలికివుండడం మహిళకు ఎంతో అవసరం. గృహిణుల శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేయకూడదు.్భరతదేశంలోస్ర్తిల విషయంలో ఇంకా అనేక లోటుపాట్లు వున్నట్లు తెలుస్తోంది.వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది.

సామాజిక చైతన్యం పెంపొందించాలి
పరత్నారెడ్డి (చిరెక్ విద్యాలయ వ్యవస్థాపకురాలు)
పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠాలేగాక సామాజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలు వుండాలి. మేము స్థాపించిన చిరెక్ విద్యా సంస్థ ద్వారా వాటిని ఆచరిస్తున్నాం. అంతేకాదు మా పాఠశాలలో మహిళా సిబ్బందే ఎక్కువ. సెక్యూరిటీ గార్డులుగా, బస్సులో కండక్టర్లుగా మహిళలకే ప్రాతినిధ్యమిచ్చాం. అప్పుడప్పు డూ విద్యార్థులను వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి తీసుకెళ్లి అక్కడి పరిస్థితులు వివరించాలి.

చిత్రాలు..వినీషా నీరో * శైలజా కిరణ్ * సినీనటి జయసుధ *సలోనీ సిదాన