ఆంధ్రప్రదేశ్‌

అందరూ కలసివస్తే హోదా ఉద్యమానికి మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతోపాటు అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రత్యేక హోదాకోసం పోరాటం చేయగలిగితే ఎన్జీవో సంఘం బేషరతుగా మద్దతు ఇస్తుందని ఎపి ఎన్జీవో సంఘానికి రెండోదఫా అధ్యక్షునిగా ఎన్నికైన పి అశోక్‌బాబు చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన సోమవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఎన్జీవో సంఘం ప్రత్యేక హోదా ఉద్యమానికి దూరంగా ఉండటాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన స్పందిస్తూ.. అప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నాయని, ప్రభుత్వం అంటూ లేదన్నారు. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం కూడా సందిగ్ధావస్థలో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజస్కంధాలపై ఎత్తుకోవాల్సి వచ్చిందన్నారు. సమ్మె విరమణ అనంతరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము ఎన్ని ఇబ్బందులు పడ్డామో తమకే తెలుసన్నారు. ప్రధానంగా సమ్మెకాలం జీతాలకోసం ఎంతగానో పోరాడాల్సి వచ్చిందన్నారు. ఇక ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి ఉన్న వ్యత్యాసాన్ని, అలాగే లాభనష్టాలను బేరీజు వేసుకోవాల్సి ఉందన్నారు. ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి నష్టమని అన్ని పక్షాలు భావించి కేంద్రంపై పోరాడే పరిస్థితి వచ్చినప్పుడు తాము కూడా మద్దతునిస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.