ఆంధ్రప్రదేశ్‌

జగన్‌ను అదుపులోకి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: వైసిపి నేత జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) పలు ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో పాక్షికంగా నేరం రుజువైనందున జగన్‌ను కస్టడీలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం సిఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో చాలా ఆస్తులు ఈడి స్వాధీనం చేసుకుందని, రేపో, మాపో హైదరాబాద్ లోటస్ పాండ్ ఇల్లు, బెంగుళూరులోని జగన్ వైట్‌హౌస్ స్వాధీనం చేసుకుంటారని, వీటికి సంబంధించి నోటీసులు జారీ చేశారని చెప్పారు. కాకపోతే ఆస్తుల మొత్తానికి సంబంధించి బిల్డింగ్‌తో పాటు ఇంట్లో ఉన్న కోట్ల రూపాయల బంగారం, పత్రాలు తదితర ఆస్తులు ఇంటి నుంచి తరలిపోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బయటకుపోతే మరలా తిరిగి వచ్చే అవకాశం లేదన్నారు. అప్పుడే ప్రజల నుంచి కొల్లగొట్టిన సొమ్ము ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలు ఏర్పడుతుందన్నారు. న్యాయం పట్ల అవగాహన ఉన్న నేతగా అడుగుతున్నానన్నారు. సిబిఐ అధికారులు ఎందుకో గాని జగన్‌కి సంబంధించి విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి విచారణ చేపట్టలేదన్నారు. వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి, జగన్ కలసి ఎక్కువగా మలేషియా ఎందుకు వెళ్లారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఇద్దరూ కలసి ఎక్కువసార్లు వారం రోజులపాటు విదేశాల్లో గడిపారని, దాన్ని అధికారులు విచారించాలని చెప్పారు. మలేషియా బొగ్గు గనుల్లో జగన్ పాత్ర ఎంత అని అడుగుతున్నానని చెప్పారు. జగన్, విజయసాయిరెడ్డిల పాస్‌పోర్టులను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. సిబిఐ దీనిపై ఎందుకు దర్యాప్తు చేయలేదో చెప్పాలన్నారు. తనకు కోర్టులపై, ప్రభుత్వ అధికారులపై అపారమైన నమ్మకం ఉందని, కాకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరిపితే దోషులను చట్టం ముందు నిలబెట్టవచ్చన్నారు. అవసరమైతే దీనిపై మరో చార్జిషీట్ అదనంగా వేయాలని కోరుతున్నానన్నారు. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, భార్య భారతి కలసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను ఢిల్లీలో ఒక ప్రైవేట్ హోటల్‌లో కలసిన తరువాత జగన్‌కు బెయిల్ లభించిందని ఆయన ఆరోపించారు.