ఆంధ్రప్రదేశ్‌

కలిసొచ్చే పార్టీలతో హోదా పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయంలో తమతో కలసొచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని పోరాడేందుకు వెనుకాడబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ నెల 16న గుంటూరులో పార్టీ అధినేత జగన్ యువభేరి ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో బొత్స మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయినా, మరే ఇతర రాజకీయ పార్టీలయినా హోదా విషయంలో కలసి పనిచేస్తామని చెప్పారు. ఢిల్లీలో ధర్నా నిర్వహించినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో జగన్ ప్రత్యేక హోదా అంశంలో రాజీలేని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 16న గుంటూరు నల్లపాడులో యువభేరి సదస్సుకు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను నిర్బంధించడంపై బొత్స స్పందిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం మహిళలను ఏరకంగా వేధింపులకు గురిచేస్తుందీ ఈ ఉదంతం తేటతెల్లం చే స్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ ముస్తా ఫా, కోన రఘుపతి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లాపార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి, మేరుగ నాగార్జున పాల్గొన్నారు.