ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ దీక్షకు అనుమతి తీసుకోవాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 13: డిమాండ్ల సాధనకు ఈనెల 26న దీక్ష చేపడతానని ప్రకటించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విధిగా పోలీసు అనుమతి తీసుకోవాల్సిందేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే అనుమతి లేకుండా ఏ కార్యక్రమం నిర్వహించకూడదనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. మహిళా పార్లమెంటు సదస్సులో గందరగోళం సృష్టించేందుకే వచ్చిన రోజాను విమానాశ్రయంలో అడ్డుకోవడంలో తప్పేమి లేదన్నారు. విజయవాడలో జైళ్ళశాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని సోమవారం మంత్రి ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ సామాజికవర్గం కోసం చేసే పోరాటంలో కోర్కెలను సాధించుకునేందుకు చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 26వ తేదీన దీక్ష చేపడతానని ముద్రగడ చేసిన ప్రకటన పట్ల చినరాజప్ప స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలుగనంత వరకూ పోలీసులకు ఏవిధమైన అభ్యంతరం ఉండదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోరని, ముద్రగడ తన దీక్షకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. కాని ఆయన మాత్రం అనుమతి అడగరంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆందోళన చేయాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని కాదని ముందుకెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతున్న క్రమంలో పెట్టుబడులు రావాలన్నారు. అప్పుడే పురోగతి సాధించవచ్చని తద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. కాని కొందరు పదే పదే అభివృద్ధికి అడ్డుపడుతూ ఆందోళనలు, నిరసనలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు మానుకోవడం లేదన్నారు. ఇది సరి కాదని, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఉద్యమాలను ప్రభుత్వం అడ్డుకుంటోందన్న వ్యాఖ్యలపై హోం మంత్రి స్పందించారు. ప్రతిపక్ష నేత ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా.. కాదన్నదెవరని ప్రశ్నించారు. విశాఖలో సిఐఐ సదస్సుకు ముందు రోజు అది కూడా రిపబ్లిక్ దినోత్సవం రోజున ఉద్ధేశ్యపూర్వకంగానే యువతను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని నివారించామే తప్ప మరొకటి కాదన్నారు. కాంగ్రెస్, వామపక్షాల ఆందోళనలు జరుగుతున్నా.. అభ్యంతరం చెప్పిన దాఖలాలేవని ప్రశ్నించారు. కేవలం శాంతి భద్రతల దృష్ట్యా ఇబ్బంది తలెత్తినప్పుడే పోలీసులు అడ్డుకుంటారని అన్నారు. ఇదిలావుండగా వైసిపి ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకోవడాన్ని హోం మంత్రి సమర్ధించారు. పవిత్ర సంగమం వద్ద జాతీయ మహిళా సదస్సు అనే పవిత్ర కార్యక్రమం జరుగుతుంటే అవాంతరం కలిగించేందుకు వచ్చేవారిని నిలువరించడం తప్పా అని ప్రశ్నించారు. వైసిపికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు సైతం సదస్సుకు హాజరై మాట్లాడారని, కాని రోజా మాత్రం గందరగోళం సృష్టించేందుకు వస్తున్నారంటూ ఆమె పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో చేసిన ప్రచారం ప్రజలకు తెలుసునని అన్నారు.