ఆంధ్రప్రదేశ్‌

‘ఉపాధి’ నిధులు ఖర్చుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను మార్చి 31లోగా ఖర్చుచేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చంద్రన్న బీమా, పంట సంజీవని పథకాలు రాష్ట్ర రైతులకు, పేదలకు మేలు కలిగించేవని, వాటి అమల్లో నిర్లక్ష్యాన్ని సహించనని హెచ్చరించారు. విజయవాడ ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతిపై జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి, పరిశ్రమకు, పొలానికి నీరు అందించడమే నీరు-ప్రగతి కార్యక్రమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల్లోనూ కంపచెట్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని, వాగులు, వం కలు అభివృద్ధి చేయడం ద్వారా నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కరవు, వరదలు రాష్ట్రానికి పెద్ద సమస్యలని, వాటిని అధిగమించేందుకే నీరు-ప్రగతి, వాటర్‌గ్రిడ్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. పంట కుంటల తవ్వకం సగం కూడా పూర్తికాక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే 45 రోజుల్లో మిగిలిన 1.45 లక్షల పంట కుంటల తవ్వకం పూర్తిచేయాలని ఆదేశించారు. సమర్థ నాయకత్వం, సమష్టి కృషితో పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించగలమని, ఇటీవల నిర్వహించిన ఏడు భారీ కార్యక్రమాలు దీన్ని రుజువు చేశాయన్నారు. చంద్రన్న బీమాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మరణ ధృవీకరణ పత్రాల జారీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆలస్యం సహించబోనన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ కింద గృహాల నిర్మాణం మరింత వేగం పుంజుకోవాలన్నారు. జీతాలు, హోదా, స్థాయి అన్నీ ప్రజల వల్లేనని, దీన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఉద్యో గి, అధికారి, ప్రజాప్రతినిధి బాధ్యత ప్రజాసేవ, సమస్యలను పరిష్కరించటమేనని ముఖ్యమంత్రి హితవు చెప్పారు. ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులు 5700 కోట్ల రూపాయలు పూర్తిగా వ్యయం చేయాలని, దీనివల్ల వచ్చే ఏడాది మరిన్ని నిధులు రాష్ట్రం ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. రాబోయేది అవుట్‌కమ్ బడ్జెట్ అని, దీనిపై అన్ని శాఖలు అప్రమత్తం కావాలని కూడా చంద్రబాబు సూచించారు. అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చిత్రం.. టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న చంద్రబాబు