ఆంధ్రప్రదేశ్‌

వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: పోలవరం పనుల్లో వేగం మరింత పెంచాలని, నిర్ణీత షెడ్యూల్‌లో ఒక వారం ఆలస్యమైనా వెనుకబడిపోతామని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రాజెక్టు కావడం వల్ల అడుగడుగునా ఆ స్ఫూర్తి కనిపించాలని కోరారు. ‘వారం వారం సమీక్షకు అత్యధిక సమయం కేటాయిస్తున్నాను. పనుల్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సందేహించకుండా నేరుగా నా దగ్గరకు రండి. వెంటనే సమయం ఇస్తాను. ఎన్ని గంటలైనా కూర్చుని చర్చిద్దాం. పోలవరం పనులు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తయితీరాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చంద్రబాబు పర్యవేక్షించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పనుల్లో జాప్యాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఒక వారం రోజులు పోలవరంలోనే వుండి ప్రత్యక్షంగా పనులను పర్యవేక్షిస్తానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి చర్చించడానికే గతంలో ప్రత్యేకంగా మంత్రి మండలి సమావేశం జరిపామని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి స్టీల్, సిమెంట్ కొనుగోలుకు ఆయా కంపెనీలతో నేరుగా మాట్లాడతానని, అవసరమైతే ప్రభుత్వం నుంచి నేరుగా చెల్లింపులు చేసి స్టీల్, సిమెంట్‌కు కొరత లేకుండా చూస్తామని తెలిపారు. పోర్టులో నిలిచిపోయిన మిషనరీని ప్రాజెక్టు ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ఒక లైజన్ అధికారిని నియమిస్తామని ప్రకటించారు. ప్రజల అవగాహన కోసం పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎగ్జిబిషన్, మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎగ్జిబిషన్, మ్యూజియం ఏర్పాటు బాధ్యతలను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్‌కు అప్పగించారు. ఈ నెల 1 నుంచి 12 వరకు స్పిల్‌వే నిర్మాణానికి సంబంధించిన మట్టి తవ్వకం పనుల్లో 5.25 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వవలసి ఉండగా, 4.75 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి. స్పిల్ ఛానల్ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో 29.30 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం జరగాల్సి ఉండగా, 12.78 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తిచేశారు. ఎడమ భాగం (లెఫ్ట్ ఫ్లాంక్) పనుల్లో 5.16 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేపట్టవలసి ఉండగా 1.49 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తిచేశారు.
రాష్ట్రంలో రానున్న వర్షాకాలం నాటికల్లా వాననీటిని భూగర్భ జలాలుగా మళ్లించేందుకు వీలుగా కాల్వలు, రిజర్వాయర్లు, చెరువుల మరమ్మతులు పూర్తిచేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రాధాన్య జలవనరుల ప్రాజెక్టులు, సాగు, మంచినీటి అవసరాలు తీర్చే రిజర్వాయర్లు, ఇతర అంశాలపై సమీక్షించారు. సాగునీటి సంఘాలు పెత్తనం చేయడానికి కాకుండా ప్రజలు, రైతుల నీటి అవసరాలను తీర్చే బాధ్యతను తీసుకోవాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా వున్న అన్ని రిజర్వాయర్ల ప్రస్తుత స్థితిని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. గాలేరు - నగరి తొలిదశ పనులు పూర్తయినందున రెండో దశ నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన టెండర్లు పిలవాలని, గాలేరు - నగరి, కేసి కెనాల్ మధ్య పరస్పర నీటి మార్పిడి విధానాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుంగభద్ర, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ జిల్లాలకు నీటి కొరత లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. మడకశిర - చిత్తూరు - కుప్పం ప్రాంతాలకు ఏప్రిల్ 15లోగా నీరు అందించాలన్నారు.

చిత్రం..పోలవరం పనులపై సమీక్షిస్తున్న
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు