ఆంధ్రప్రదేశ్‌

‘వాటా’పై బలిజల వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 14: కాపు కార్పొరేషన్ ద్వారా అందుతున్న ఫలాలన్నీ కాపులకే తప్ప బలిజలకు అందడం లేదంటూ ఇప్పటివరకూ ఆందోళన చేస్తున్న బలిజ నేతలు తాజాగా అదే డిమాండ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి వినిపించారు. కాపురిజర్వేషన్లపై ఉద్యమిస్తున్న ముద్రగడ తన మొండి వైఖరి విడనాడి, అందరూ కలసి ముఖ్యమంత్రిని కలసి ఒత్తిడి చేద్దామంటూ ఇప్పటివరకూ వాదిస్తూ వచ్చిన బలిజ నేతలు, ముద్రగడ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారే కలసి వినతిపత్రం సమర్పించడం కొత్త పరిణామం.
రిజర్వేషన్లపై ముఖ్యమంత్రిని కలి సి, సమస్యలు వివరించకుండా కేవలం రాజకీయ కోణంలోనే విమర్శిస్తున్న ముద్రగడ వైఖరిని బలిజ నేతలు తప్పుపడుతూ వచ్చారు. కాపు-బలిజ నేతలంతా కలసి సీఎంను కలిసి ఒత్తిడి చేయాలని, అప్పుడు స్పందించకపోతే కలసి రోడ్డెక్కుదామని, అసలు సీఎంను కలవకుండా సమస్య ఎలా పరిష్కారమవుతుందని బలిజ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ ఓ.వి.రమణ, రాష్ట్ర బలిజనాడు కన్వీనర్ బి.శివశంకరబాబు గత కొన్ని నెలల నుంచి ము ద్రగడను ప్రశ్ని స్తూ వచ్చారు. దానితో ఎట్టకేలకు వైఖరి మార్చుకున్న ముద్రగడ సరైన పిలుపు వస్తే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగానే ఉన్నానని ప్రకటించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బలిజ నేతలు తాజాగా సీఎం బాబును కలిసి తమ డిమాండ్లు, సమస్యలు వినిపించారు. విదేశీ విద్య, స్కాలర్‌షిప్‌లలో కాపులకే తప్ప, బలిజలను పట్టించుకోవడం లేదని, బలిజలకు జిల్లాల్లో హెల్ప్‌డెస్కులు ఏర్పాటుచేయాలని, కాపు కార్పొరేషన్‌ను రాయలసీమ కేంద్రంగా తిరుపతిలో మరో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుచేయాలని కోరారు. ఒకవేళ సాంకేతికంగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే బలిజలకు ఆ హోదా ఇవ్వాలన్నారు. రాయలసీమలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ తమకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కేవలం రెండు జిల్లాల్లోనే ఉన్న కాపులకు ప్రాధాన్యమిస్తూ తమను విస్మరించడం సరైంది కాదని బలిజ నేతలు బాబు దృష్టికి తీసుకువెళ్లారు. బాబు వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడిన బలిజ నేతలు తాము తునిలా కాకుండా శాంతియుతంగానే సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పారు.
ప్రభుత్వం కాపులను చూసి బలిజలను విస్మరిస్తోందన్న భావన అందరిలో ఉందన్నారు. అలాగైతే తాము సత్తా చూపించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తే సానుకూలంగా ఉంటామని, తమ ప్రతిపాదనపట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తే, సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ ముద్రగడతో కలసి రోడ్డెక్కేందుకూ సిద్ధమేనని స్పష్టం చేశారు. సమస్యల సాధన కోసం ఎవరితోనైనా కలసి పనిచేసేందుకు, ఏ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నామన్నారు.
తాము ప్రభుత్వానికి వ్యతిరేకమో, అనుకూలమో కాదని, బలిజల సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తే అభినందిస్తామని స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంతో చర్చలకు గానీ, ముఖ్యమంత్రిని కలిసేందుకు గానీ సిద్ధంగా లేరన్న సంకేతాలు కాపు-బలిజ-తెలగ-ఒంటరి వర్గాలకు వెళ్లాయి. ఒకవైపు సమస్యల పరిష్కారం కోసం బలిజలు ప్రభుత్వం వద్దకు వెళ్లి, వినతిపత్రాలు సమర్పించి సానుకూల వాతావరణంలో రిజర్వేషన్లు సాధించుకోవాలని ప్రయత్నిస్తుంటే, ముద్రగడ మాత్రం ఘర్షణ వైఖరిని కొనసాగించి, సమస్యను అదేవిధంగా ఉంచుతున్నారన్న వ్యాఖ్యలు కాపు సామాజికవర్గంలో వినిపిస్తున్నాయి.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన బలిజ నేతలు