ఆంధ్రప్రదేశ్‌

నేడు వైకాపాలో చేరనున్న గంగుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, ఫివ్రబరి 14: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టిడిపి నియోజవర్గం ఇంచార్జి గంగుల ప్రభాకరరెడ్డి బుధవారం వైకాపాలో చేరనున్నారు. హైదరాబాద్‌లో పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైకాపా కండువా కప్పుకోనున్నారు. మంగళవారం ఆళ్లగడ్డలో తన అనుచరులు, నియోజకవర్గంలోని అభిమానులతో సమావేశమైన గంగుల తన మనసులో మాట చెప్పారు. దీనికి వారు సమ్మతించి మీ వెంటే నడుస్తామని భరోసా ఇవ్వడంతో ఇక గంగుల వైకాపాలో చేరనున్నట్లు ప్రకటించారు. కాగా ఆళ్లగడ్డ రాజకీయాలను పరిశీలిస్తే గంగుల, భూమా వర్గం మధ్య వర్గపోరు కొనసాగుతూనే వచ్చింది. నిన్నటి వరకు రెండు వర్గాలు ఒకే పార్టీలో కొనసాగినప్పటికీ ఇద్దరు నేతల మధ్య సమన్వయం లోపించింది. దీంతో ఇకపై టిడిపిలో ఇమడలేక గంగుల వర్గం వైకాపాలో చేరాలని నిర్ణయించుకుంది. గంగుల, భూమా వర్గీయులు ఏడాది కాలం టిడిపిలో కొనసాగినప్పటికీ ఏనాడు కలిసి కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. గంగుల వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. 2014లో టిడిపిలో చేరి ఎన్నికల్లో పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వైకాపా తరుపున పోటీ చేసిన శోభానాగిరెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే ఎన్నికలు వాయిదా పడకపోవడంతో శోభానాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ వైకాపా తరుపున పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి నిర్ణయించడంతో అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా వైకాపా నుంచి గెలిచిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, తన కుమార్తెఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టిడిపిలో చేరారు. అప్పటి నుంచి గంగుల, భూమా వర్గాలు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి పనిచేసింది లేదు. ఈ తరుణంలో గంగుల వర్గాన్ని సిఎం చిన్నచూపు చూస్తున్నరన్న విమర్శలు కార్యకర్తల్లో తలెత్తాయి. దీంతో పార్టీ వీడాలని గంగుల గత కొన్నిరోజులుగా భావిస్తూ వచ్చారు. చివరకు మంగళవారం తన నిర్ణయాన్ని కార్యకర్తల సమక్షంలో వెల్లడించారు.