ఆంధ్రప్రదేశ్‌

కురుక్షేత్రలో శ్రీవారి ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 14: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి 11 కోట్ల రూపాయలతో నూతన సహస్రనామ కాసుల హారం తయారుచేయించడానికి టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం తిరుమల్లోని అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేఖరులకు వివరించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ ఈ కాసుల హారం తయారీకి అమెరికాకు చెందిన రామలింగరాజు అనే భక్తుడు విరాళం ఇచ్చాడన్నారు. తిరుమలలో సర్వదర్శనం క్యూలైన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 వద్ద మరో నూతన కాంప్లెక్స్‌ను నిర్మించాలని నిర్ణయించామని ఇందుకు రూ. 5కోట్ల నిధులు కేటాయించామన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి లండన్‌కు చెందిన నిర్మల సేథియా ఫౌండేషన్ రూ. 12 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని, ఈమొత్తాన్ని స్వీకరించడానికి బోర్డు ఆమోదించిందన్నారు. తిరుమలలోని వివిధ వీధులు, కాటేజీలు, విశ్రాంతి గృహాల్లోని ఎల్‌ఇడి బల్బులు అమర్చడానికి బోర్డు అంగీకరించిందన్నారు.
అంచనా బడ్జెట్ రూ. 2.858.48 కోట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా బడ్జెట్ 2017-18 సంవత్సరానికి రూ.2858కోట్ల 48 లక్షలుగా నిర్ణయించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు విలేఖరులకు తెలిపారు. క్యాపిటల్ ఫండ్-కానుకలు ద్వారా 2016-17 సంవత్సరానికి గాను రూ. 1110కోట్లు ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది కూడా 1,110 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. పెట్టుబడులపై వచ్చే వడ్డీ గతేడాది రూ.762.58 కోట్లు ఆదాయం వచ్చిందని ఈ ఏడాది రూ.807.72 కోట్లు ఆదాయం రావచ్చని భావిస్తున్నామన్నారు. రూ. 300 ప్రత్యేక దర్శనం, శీఘ్రదర్శనం, బ్రేక్ దర్శనాల ద్వారా ఈ ఏడాది కూడా రూ.256 కోట్లు ఆదాయం రావచ్చని భావిస్తున్నామన్నారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.165 కోట్లు, భక్తులు సమర్పించిన తలనీలాలు విక్రయం ద్వారా రూ.100 కోట్లు, వసతి గదుల అద్దె ద్వారా రూ.124 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆర్జిత సేవ టికెట్ల విక్రయం ద్వారా రూ.55 కోట్లు, బంగారు డాలర్ల విక్రయం ద్వారా రూ.20కోట్లు ఆదాయ రావచ్చని భావిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌లో ధర్మ ప్రచారానికి హిందూ ధర్మ ప్రచారానికి రూ. 125 కోట్లు కేటాయించామన్నారు.

చిత్రం..ధర్మకర్తల మండలి నిర్ణయాలను వివరిస్తున్న చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి