ఆంధ్రప్రదేశ్‌

ఉక్కుకు నీటి ఇక్కట్లు తప్పవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కు కర్మాగారానికి నీటి ఇబ్బందులు తప్పేట్టు లేవు. గతేడాదితో పోలిస్తే ఈ సారి నీటి సరఫరాలో తీవ్ర వ్యత్యాసం చోటుచేసుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు ఉక్కు కర్మాగారానికి నీటిని సరఫరా చేసే ఏలేరు కాలువ పూడికతో నిండిపోయింది. కాలువ మరమ్మతులకు ప్రతిపాదించినప్పటికీ సకాలంలో పనులు పూర్తి కాకుంటే ఉక్కుకు నీటి ఇక్కట్లు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి రోజుకు 35 నుంచి 40 ఎంజిడి (మిలియన్ గేలన్స్ పర్‌ఎడే) నీరు అవసరం. ఉక్కు కర్మాగారం నీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి నీటిని తరలించే విధంగా ఏలేరు కాలువ నిర్మించారు. స్టీల్‌ప్లాంట్ తన నీటి అవసరాల కోసం ప్రత్యేకంగా కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (కెబిఆర్)ను నిర్మించుకుంది. స్టీల్‌ప్లాంట్‌కు 50 రోజుల పాటు అవసరమయ్యే నీటిని ఈ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే నీటిని వినియోగిస్తుంటారు. ఏలేరు కాలువ ద్వారా నగరానికి రోజుకు 60 నుంచి 65 ఎంజిడిల నీరు సరఫరా కావాల్సి ఉంది. అయితే కాలువ నిర్మాణం చేపట్టిన తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో పూడికతో నిండిపోయింది. కాలువ ద్వారా నీటి సరఫరా నిర్మాణ సమయంతో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. దీనికి తోడు ఏలేరు కావల నీటిని సాగునీటి అవసరాల కోసం వినియోగించడంతో నగరానికి నీటి సరఫరాలో వ్యత్యాసం చోటుచేసుకుంటోంది. సీజన్‌లో రైతులు ఏలేరు నీటి కోసం పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా విశాఖ పారిశ్రామిక అవసరాలకు ఏలేరు ద్వారా జరిగే నీటి కేటాయింపుల్లో గణనీయమైన కోత అమలు చేయాల్సి వస్తోంది.