ఆంధ్రప్రదేశ్‌

2025 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 15: ప్రపంచ స్టీల్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ, భారత దేశంలో స్టీల్ ఉత్పత్తి, అమ్మకాలకు పెద్దగా ఎదురుదెబ్బ తగల్లేదు. గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు స్వల్పంగా క్షీణించినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన ఉత్పత్తి, వినియోగం జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గడచిన కొద్ది సంవత్సరాలుగా దేశంలోని ఉక్కు ఉత్పత్తిపై దెబ్బతీస్తున్న చైనా స్టీల్ ఇప్పుడు కోలుకోలేని స్థితికి చేరుకుంది. స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే కీలక భూమికను పోషిస్తున్న చైనా స్టీల్ అంచనాలకు మించి ఉత్పత్తి చేయడం, ప్రపంచ వ్యాప్తంగా చైనా స్టీల్ దిగుమతులు తగ్గిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో భారత దేశం ఉక్కు ఉత్పత్తులను ముమ్మరం చేసింది. దేశంలో ఉక్కు వినియోగాన్ని గడచిన తొమ్మిదేళ్ల నుంచి చూస్తే.. 2008లో 52.1 మిలియన్ టన్నులు ఉండేది. 2009లో 52.4, 2010లో 59.3, 2011లో 66.4 మిలియన్ టన్నులు ఉంది. 2012లో 71.0 మిలియన్ టన్నులు, 2013లో 73.5, 2014లో 74.1, 2015లో 76.99, 2016లో 58.94 మిలియన్ టన్నులకు చేరుకుంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో స్టీల్ వినియోగం తగ్గడానికి ప్రపంచ మార్కెట్‌లో ఆర్థిక ఒడిదుడుకులే కారణమని నిపుణులు చెపుతున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నందున 2017 చివరి నాటికి స్టీల్ వినియోగం 104 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భారత దేశంలో స్టీల్ వినియోగం మరింత ఆశాజనకంగా ఉంటుందని చెపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న రైల్, రోడ్ పనులు, వౌలిక సదుపాయల కల్పన, గృహ నిర్మాణం పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నందున స్టీల్ వినియోగం భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. భారత ఉక్కు రంగంలో 2016లో సెయిల్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఉక్కు ఉత్పత్తిలో 2003లో మూడో స్థానంలో ఉన్న భారత దేశం, 2016లో రెండో స్థానానికి చేరుకుంది. ఉక్కు కర్మాగారాల ఆధునీకరణ, సక్రమ నిర్వహణ, ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించడం వలన దేశంలో ఉక్కు రంగం మెరుగైన ఫలితాలను సాధిస్తోందని తెలుస్తోంది. భారత దేశంలోని ఉక్కు కర్మాగారాలన్నీ కలిపి 2016-17లో 85.8 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయచ్చని అంచనా వేస్తున్నారు. ఇది 2025 నాటికి 300 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశం ఉందని ఉక్కురంగ నిపుణులు తెలియచేస్తున్నారు. సెయిల్ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 12.8 మిలియన్ టన్నుల నుంచి 21.4 మిలియన్ టన్నులకు పెంచారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 3.0 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్‌కు పెరిగింది.