ఆంధ్రప్రదేశ్‌

సామాన్యుడి ‘గుండె’ల్లో మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 15: సామా న్య, మధ్య తరగతి జీవులు ఒక్కసారి గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరితే ఇక వారి ఆర్థిక పరిస్థితి విషాదమే. స్టెంట్ల పేరిట వేలు, లక్షలు పోసి మనిషిని బతికించుకోవాలంటే ఉన్న ఆస్తులు తెగనమ్ముకోవాల్సిందే. దాని తో సగటు జీవి అప్పులపాలయి, ఆర్థికంగా పతనమయి రోడ్డున పడాల్సిన దుస్థితి. ఇందుకు కారణం స్టెంట్. గుండెను నిరంతరాయంగా పనిచేయించే ఈ స్టెంట్ ధర ఇప్పటివరకూ వేలు, లక్షలు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ వాటి ధరను 85 శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం భారతీయ జనతాపార్టీకి ప్రచారాస్త్రం కానుంది. అది ఆ పార్టీని సామాన్యులకు చేరువ చేయనుంది. ఆ మేరకు బిజెపి నాయకత్వం ప్రచార వ్యూహానికి పదునుపెడుతోంది. గుండె చికిత్సలో అత్యంత కీలకమైన స్టెంట్ల ధరను అనూహ్యంగా తగ్గిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంపై సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ వర్గాలకు గుండె జబ్బు వస్తే ఇక వారి ఆర్థిక పరిస్థితి దిగజారినట్లే. ఖరీదైన స్టెంట్ల కొనుగోలు కోసం ఇళ్లు, పొలం, ఫ్లాట్లు, నగలు తెగనమ్మో, తాకట్టు పెట్టో తమ వారిని బతికించుకునే ప్రయత్నాలు ఇప్పటివరకూ చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు, గుండె చికిత్సలు చేసే ఒక స్థాయి ఆసుపత్రులు కూడా స్టెంట్ల ధరను రోగి ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయి. దీనిని గమనించిన మోదీ చుక్కల్లో ఉన్న స్టెంట్ల ధరను 85 శాతానికి తగ్గిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 45 వేల రూపాయలున్న బేర్‌మెటల్ స్టెంట్స్ ధరను 7260 రూపాయలు, లక్ష 21 వేల రూపాయలున్న డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్‌ను 31,080 రూపాయలకు తగ్గిస్తూ కేంద్రం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీనిని అతిక్రమించిన ఆసుపత్రుల లైసెనె్సలు రద్దు చేస్తామని హెచ్చరించింది. మోదీ తీసుకున్న తాజా నిర్ణయం కార్పొరేట్ ఆసుపత్రులకు చావుదెబ్బగానే భావిస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి వర్గాలకు భారీ స్థాయిలో డబ్బును మిగిల్చిన మోదీ నిర్ణయాన్ని, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బిజెపి నాయకత్వం నిర్ణయించింది. దీనివల్ల కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక ప్రయోజనంతో పాటు, ప్రతి వందమందిలో 40 మంది గుండెజబ్బులతో ఆసుపత్రుల్లో చేరి స్టెంట్ల ధరలతో ఆర్థికంగా చితికిపోతున్నారని గ్రహించిన బిజెపి, ఆ మేరకు వారికి జరిగిన లబ్ధిని వివరించేందుకు ప్రజలతోపాటు, మీడియా, సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. గుండె జబ్బుతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి అయ్యే ఖర్చు, మోదీ సామాన్యుల కోసం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను పోల్చి చూపే కరపత్రాలు రూపొందించనుంది. దానితోపాటు మోదీకి కృతజ్ఞతలు తెలిపే హోర్డింగులు, ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేయనుంది. దీనివల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాలు పార్టీ వైపు ఆకర్షితులవుతారని, ముఖ్యంగా ఈ వర్గాల్లోని విద్యాధికులు పార్టీకి కచ్చితంగా సానుభూతిపరులుగా మారతారన్న అంచనాతో ఉంది.
ఇది ప్రజలకు బిజెపి కృతజ్ఞత!
‘ఒక సగటు మనిషి గుండెజబ్బుతో ఆసుపత్రిపాలైతే వారి నుంచి కార్పొరేట్, సాధారణ ఆసుపత్రులు స్టెంట్ల పేరిట ఏ స్థాయిలో డబ్బు వసూలుచేస్తాయో, దానికోసం ఉన్నవి అమ్ముకున్న బాధిత కుటుంబాలకు తెలుసు. సామాన్యుడి కష్టాలు తెలుసుకున్న మోదీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని వారి పట్ల తమకున్న చిత్తశుద్ధి నిరూపించుకుంది. ఇది ప్రజలకు బిజెపి తెలిపిన కృతజ్ఞత. అది మా బాధ్యత. మేం ఎప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉంటామన్న దానికి ఇదో ఉదాహరణ’ అని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోమువీర్రాజు, మాజీ మంత్రి, సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. దీనిపై తాము ప్రజల్లోకి వెళ్లి వారికి కలిగిన లబ్ధిని వివరిస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలన్నారు. అప్పటి యుపిఏ ప్రభుత్వం స్కాముల్లో మునిగితే ఎన్డీఏ పబ్లిక్ స్కీములతో వెళుతోందని వారు వివరించారు.