ఆంధ్రప్రదేశ్‌

ఇస్రోకి మంత్రుల అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 15: దేశప్రతిష్ఠను ప్రపంచానికి చాటిన ఇస్రో శాస్తవ్రేత్తలు కృషి విజయవంతమైనందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు కె.ఇ. కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమ, పరిటాల సునీత, శిద్ధా రాఘవరావు, యనమల రామకృష్ణుడు, మాణిక్యాలరావు, గంటా శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.
కళా, లోకేష్, హరిబాబు అభినందనలు
దేశ ప్రజలు గర్వపడేలా పిఎస్‌ఎల్‌వి-సి37 ప్రయోగం విజయవంతం కావడంపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కళా వెంకట్రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని ఎదురులేని శక్తిగా నిలబెట్టిన ఘనత ఇస్రో శాస్తవ్రేత్తలకు దక్కుతుందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్తవ్రేత్తల విజయం అనిర్వచనీయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు అభినందనలు తెలిపారు. ఇస్రో నిలకడైన ప్రతిభ కనబరుస్తూ గొప్ప ప్రయోగం చేయడం ద్వారా దేశ కీర్తిని పతాకస్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు.