ఆంధ్రప్రదేశ్‌

అనంతలో ఐదు నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 15: అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో పట్ట్భద్రుల స్థానానికి మూడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెండు నామినేషన్లు వేశారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సమక్షంలో నామినేషన్లు దాఖలు చేశారు. పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఎన్‌జిఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ స్థానానికి ఆ పార్టీ అనుబంధ సంఘం వైఎస్‌ఆర్‌టిఎఫ్ నుంచి కెవి.సుబ్బారెడ్డి నామినేషన్లు వేశారు. వీరితో పాటు ఎ.మల్లికార్జున, శేషుయాదవ్ పట్ట్భద్రుల స్థానానికి, ఎస్.విజయలక్ష్మి ఉపాధ్యాయ స్థానానికి నామినేషన్లు దాఖలు చేశారు. 17వ తేదీ ఉపాధ్యాయ స్థానానికి టిడిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య ఉపాధ్యాయ స్థానానికి, సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ సిపిఎం తరఫున, కాంగ్రెస్ అభ్యర్థి మాసూలు శ్రీనివాసులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 20తో నామినేషన్ల గడువు ముగుస్తుంది.
చిత్తూరులో నాలుగు..
చిత్తూరు: చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం పట్ట్భద్రుల స్థానానికి రెండు నామినేషన్లు, ఉపాధ్యాయుల స్థానానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం పట్ట్భద్రుల స్థానానికి ఒక్కరు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. పట్ట్భద్రుల స్థానానికి ప్రకాశం జిల్లాకు చెందిన ఏలూరి రామచంద్రారెడ్డి ఇండియన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన డాక్టర్ సురేష్‌రాజు ఇండిపెండింగ్ అభ్యర్థిగాను నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి తిరుపతి నగరానికి చెందిన ఆనందనాయుడు ఎపిటిఎఫ్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానానికి తిరుపతికి చెందిన చదలవాడ సుచరిత స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఉత్తరాంధ్రలో ఐదుగురు..
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గానికి బుధవారం ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారు. పిడిఎఫ్ అభ్యర్థి అజ శర్మ మంగళవారం నామినేషన్ దాఖలు చేయగా, బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వివి రమణమూర్తి, ఎం సత్య జగన్నాథరావు, మాకిరెడ్డి బుల్లిదొర, సతివాడ రమణ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. కాగా, టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి ఇంకా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది.