ఆంధ్రప్రదేశ్‌

చేనేత కార్మికులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: చేనేత కార్మికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా చేనేత అడ్వయిజరీ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో చేనేత శాఖ పనితీరుపై బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా చేనేత బజార్ల ఏర్పాటు వేగవంతం చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చేనేత రుణమాఫీ ప్రక్రియ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. చేనేత కార్మికుల వర్క్‌షెడ్‌ల నిర్మాణానికి 25 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలన్నారు. కార్మికుల, సొసైటీలకు చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరగాలన్నారు. చేనేత కార్మికులు ఇంటివద్దే నేత పనులు చేస్తుండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ క్లస్టర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 75 వేల చేనేత కార్మికులకు పింఛన్లు అందచేస్తున్నామని, మరో 25 వేల మందికి అందించేందుకు నిర్ణయించామన్నారు. సొసైటీలకు బకాయిల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చేతి మగ్గాల నుంచి పవర్‌లూమ్‌ల వినియోగానికి మారాలనుకునే వారికి అనుమతులు త్వరగా మంజూరు చేయాలన్నారు. చేనేత రంగంలో సాంకేతికతతోపాటు ఫ్యాషన్ డిజైన్‌ను వినియోగించాలన్నారు. చేనేతను పరిరక్షించుకోవడంతోపాటు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కిష్టప్ప, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.