ఆంధ్రప్రదేశ్‌

మరింతకాలం మనమే ఏలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 15: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం పాటు పాలన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పి చెంగల్రాయుడు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి కుంటిపడిందన్నారు. పద్ధతి లేకుండా రాష్ట్ర విభజన చేశారు. ఒక కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయినా పద్ధతి ప్రకారం పంపకాలు నిర్వహించుకుని విడిపోతారని, విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు అప్పులతోపాటు కష్టాలు వచ్చాయన్నారు. అయితే కష్టపడితే ఏదైనా సాధించగలమనే విశ్వాసం తనకుందన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని ముందుకు సాగాలని అన్నారు. అందరం కలిసి పని చేయాలనే దృక్పథంతో నెంబన్ వన్ కార్మికుడిగా ముందుండి పాలన సాగిస్తున్నానన్నారు. కార్యకర్తల సహకారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. విభజన నాటికి విద్యుత్ రంగంలో తీవ్రకొరత ఉండేదన్నారు. పాలనా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. దేశంలో విద్యుత్ రంగంలో ప్రకటించిన ప్రథమ బహుమతులన్నీ మన రాష్ట్రానికే వచ్చాయన్నారు. పోలవరం, గాలేరు, నగరి, హంద్రినీవా వంటి అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీల వ్యవహార శైలిపై సుప్రీం కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చానన్నారు. పార్టీలో చేరిన వారందరినీ పేరుపేరున ముఖ్యమంత్రి అభినందించారు. పార్టీలో నూతనంగా చేరినవారు, పాతవారు పాలు, నీళ్లలా కలిసి పని చేయాలన్నారు.
రైల్వే కోడూరు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా... 2029 నాటికి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా... 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఓ రాష్ట్రంగా చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎంపి సిఎం రమేష్, రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిత్రం..ఎమ్మెల్సీ చెంగల్రాయుడిని టిడిపిలో చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు