ఆంధ్రప్రదేశ్‌

బోగస్ ఓటర్లను తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్‌లో పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్ల పేర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఓటర్ల జాబితాను తయారు చేసిన అధికారులు, సిబ్బంది పేర్లను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథం, జస్టిస్ షామీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. రాయలసీమ డెవలప్‌మెంట్ కమిటీకి చెందిన జి ఓబులు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఓటర్ల జాబితాలో బోగస్ పేర్లను తొలగించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈసందర్భంగా హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్ల పేర్లను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు పేర్కొంది. బోగస్ ఓట్లను తొలగించి సజావుగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని హైకోర్టు పేర్కొంది. బోగస్ ఓటర్ల నమోదుకు బాధ్యులైన అధికారులపై తీసుకున్న చర్యలను వివరించాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ దాదాపు ఓటర్ల నమోదుకు 7.13 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 83,777 దరఖాస్తులను తిరస్కరించామని, 4383 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఫిబ్రవరి 20వ తేదీకి స్క్రూటినీ పూర్తవుతుందని తెలిపారు. బోగస్ ఓటర్ల నమోదుకు బాధ్యులైన అధికారులకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులను జారీ చేసిందన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎ సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ84 మంది ఓటర్లకు డిగ్రీలు లేవని, వీరిపై ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల సంఘం 40 పేర్లను తొలగించిందని, కాని 44 మందికి డిగ్రీసర్ట్ఫికేట్లు ఉన్నాయని పేర్కొందన్నారు. వాస్తవానికి వీరందరూ తప్పుడు ధృవపత్రాలు ఇచ్చారన్నారు. ఈ 44 మంది వివరాలను తెలియచేయాలని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు ఫిబ్రవరి 21వ తేదికి వాయిదా వేసింది. ఆ రోజు స్టేటస్ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.