ఆంధ్రప్రదేశ్‌

మినుముకు తెగులుపై శాస్తవ్రేత్తల అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: రబీ కాలంలో మెట్ట పైరుగా, మాగాణులతో వేసిన మినుము పంటలో తామర పురుగుల ద్వారా ఆశించిన మొవ్వకుళ్ళు వైరస్ కారణంగా వ్యాపించిన తలమాడు తెగులుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గణనీయంగా పంట దెబ్బతిన్నది. తామర పురుగు అనే రసం పీల్చే పురుగు మినుము పంటలో ప్రతి సంవత్సరం కొంత మేరకు ఆశించటం సహజం. అయతే కేవలం ఈ పురుగు ఉద్ధృతి వలన మినుము పంటకు తీవ్ర నష్టం జరగటం గతంలో ఎన్నడూ జరగలేదు. ముఖ్యంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటం, ఉష్ణోగ్రతలు పెరగటం వలన తామర పురుగుల ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది, అంతేకాక ఈ తామర పురుగులు మొవ్వకుళ్ళు వైరస్‌ను మొక్కలకు సంక్రమింపజేశాయ. వైరస్ వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఉండటం వలన పదిహేను రోజుల కాలంలోనే ఉద్ధృతంగా వ్యాపించింది. అక్కడక్కడ ఒక మొక్క మీద ఈ వ్యాధిని గమనించిన వెంటనే వ్యవసాయ శాస్తవ్రేత్తలు వ్యాధిని సంక్రమింపజేసే పురుగు నివారణకు సస్యరక్షణ చర్యలు సిఫారసు చేసి, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా రైతుల్లో అవగాహన పెంచారు. ఈ చర్యల వలన పురుగు నియంత్రింపబడినప్పటికీ, అప్పటికే మొక్కల్లో సంక్రమించిన వైరస్ మొక్కల తలను మాడ్చివేసింది. కృష్ణా , గుంటూరు , పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా నవంబర్‌లో విత్తిన మినుములో రమారమి 30వేల హెక్టార్లలో పైరు సంపూర్ణంగా దెబ్బతింది. డిసెంబర్ నెలలో విత్తిన ప్రాంతాల్లో మరియు సిఫారసు చేసిన మందులు సక్రమంగా వాడిన ప్రాంతాల్లో పంట దిగుబడులు ఆశించిన మేరకు వచ్చే అవకాశాలు వున్నాయి. ఈ జీవపరమైన విపత్తు నుంచి పంటను పరిరక్షించటానికి శాస్తవ్రేత్తలు బృందాలుగా ఏర్పడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించటమే ప్రత్యక్షంగా రైతులకు వ్యవసాయశాఖ అధికారులకు, రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచనల మేరకు భారత జాతీయ అపరాల పరిశోధనా సంస్థ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ సంజీవ్ గుప్తా, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధనా సంచాలకులు, డాక్టర్ ఎన్‌వి నాయుడు, కృష్ణా మండలం సహాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ పావులూరి రత్న ప్రసాద్, లాం శాస్తవ్రేత్తలు క్షేత్రస్థాయిలో ఈ సమస్యను విశే్లషించారు. ఈ విశే్లషణ నివేదికను సంజీవ్ గుప్తా వ్యవసాయ శాఖ మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన తామర పురుగులు ప్రతి సంవత్సరం మినుము పైరును ఆశించినప్పటికీ దాని ద్వారా ప్రతి సంవత్సరం ఈ వైరస్ సంక్రమించకపోవచ్చునని తెలిపారు. ఇది కేవలం వాతావరణ వైపరీత్యాల వలన ఈ సంవత్సరం విస్తృతంగా వ్యాపించిందన్నారు.
రాబోయే కాలంలో ఈ వ్యాధిని నివారించే చర్యల్లో భాగంగా ఆయన శాస్తవ్రేత్తలు సిఫారసు చేసిన మందులనే వాడాలని, ఆశాస్ర్తియంగా వ్యాపార దృక్పథంతో మందులు సిఫారసు చేయటం వలన వ్యాధి నివారింపబడకపోగా ఖర్చులు పెరిగాయి అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ పల్లాకు తెగులు, మొవ్వకుళ్ళు, సీతాఫలం తెగులు వంటి వైరస్ తెగుళ్ల నివారణకు ప్రత్యేక పరిశోధనలు చేపట్టాలని, దీనికి గాను భారత జాతీయ అపరాల పరిశోధనా సంస్థ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. రైతులు విధిగా విత్తనశుద్ది చేసుకోవాలని సూచించారు. అదే విధంగా దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి తగిన చర్యలు చేపట్టి రైతులను సరైన సమయంలో ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుందని మంత్రి అన్నారు. మంత్రి సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకుని పరిశోధనలకు తగిన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని డాక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు.