ఆంధ్రప్రదేశ్‌

పిపిపి పద్ధతిలో రైల్వేస్టేషన్ల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 16: సౌత్‌సెంట్రల్ రైల్వే పరిధిలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులను వచ్చే ఏడాది నుండి పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో చేపట్టనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం గుంటూరు పర్యటనకు ప్రత్యేక రైలులో విచ్చేసిన జిఎం గుంటూరు రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో వినోద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ నడికుడి నుండి శ్రీకాళహస్తి వరకు చేపట్టిన 30 కిలోమీటర్ల మేర నూతన రైల్వేట్రాక్ నిర్మాణ మొదటి దశ పనులను 2017లో పూర్తి చేస్తామన్నారు. నూతన రాజధాని అమరావతికి రైలు నిర్మాణం కోసం 2,680 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు తెలిపారు. గుంటూరు నుండి విజయవాడకు నూతన రాజధాని అమరావతి మీదుగా నంబూరు, తాడికొండ, అమరావతి, గొట్టిముక్కల, ఎర్రుబాలెం స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ రైలుమార్గాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే అమరావతి-పెదకూరపాడు, సత్తెనపల్లి-నర్సరావుపేట నూతన రైలు మార్గాలను కూడా సర్వే చేస్తామని తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో నూతన రాజధాని అమరావతికి రైలు సౌకర్యాన్ని కల్పిస్తామని, త్వరితగతిన పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెనాలి, గుంటూరు డబ్లింగ్ పనులు 2018 నాటికి పూర్తవుతాయన్నారు. ఎంపిలు, ఎమ్మెల్యేల నుండి ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాప్‌లు, నూతన రైళ్ల ఏర్పాటుపై విజ్ఞప్తులు వచ్చాయని వీటిని రైల్వేబోర్డుకు తెలియజేస్తామన్నారు.