ఆంధ్రప్రదేశ్‌

నీటి ఎద్దడి నివారణకు రూ.35 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో నీటి ఎద్దడి నెలకొన్ని ఐదు జిల్లాల్లో రాష్ట్ర విపత్తు స్పందన నిధుల నుంచి 35 కోట్ల రూపాయల విడుదల చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప తెలిపారు. అనంతపురానికి 10 కోట్ల రూపాయలు, చిత్తూరు జిల్లాకు 6, కడప, నెల్లూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, ప్రకాశం జిల్లా 12, శ్రీకాకుళం జిల్లాకు 1 కోటి రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ఈ జిల్లాల్లో మారుమూల ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తారని బుధవారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 172, అనంతపురం జిల్లాలో 238, చిత్తూరు జిల్లాలో 480 గ్రామాల్లో, కడపలో 16 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామన్నారు.
రాష్ట్ర విపత్తు స్పందన నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేశామన్నారు. రానున్న వేసవి దృష్ట్యా ఇప్పటి నుంచి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గత ఏడాది తరహాలో నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.