ఆంధ్రప్రదేశ్‌

వ్యర్థాల నుంచి ఇంధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో వివిధ నగర పాలక, పురపాలక సంఘాల్లో ఉత్పత్తి అవుతున్న చెత్తను ఇంధనంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కర్మాగారాల ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే స్థలాలను కేటాయించింది. ఒంగోలులో కూడా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి ఏర్పాటు చేసేందుకు గురువారం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో రోజూ ఉత్పత్తి అవుతున్న చెత్తను నిర్వహించడంలో ప్రభుత్వం సమస్యలు ఎదుర్కోంటోంది. డంపింగ్ యార్డులకు స్థలాలను కేటాయించడం సమస్యగా మారుతోంది. పేరుకుపోతున్న చెత్తను నిర్వహణ కష్ట సాధ్యంగా మారుతుండటంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఘన వ్యర్ధాల సమస్యను కొంతమేరకు ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా అధిగమిస్తున్నప్పటికీ, పట్టణీకరణతో పూర్తిగా అధిగమించలేని స్థితి నెలకొంది. దీంతో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. విశాఖ, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో 10 చోట్ల ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించారు. ఒక్కో విద్యుత్ కర్మాగారం నుంచి 5 నుంచి 13 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. దాదాపు 140 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 77 శాతం చెత్తను ఇంధనంగా మార్చుకునే వీలు కలుగుతుందని అంచనా. ఈ కర్మాగారాల ఏర్పాటుకు పర్యావరణ పరంగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. 90 శాతం మేరకు వాటిని ప్రభుత్వం జోక్యం చేసుకుని అధిగమించింది. మిగిలిన అభ్యంతరాలను కూడా లేకుండా చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు.