ఆంధ్రప్రదేశ్‌

గోసంరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 16: సకల సంపదలను ప్రసాదించి, మానవాళికి సర్వ శుభాలను అనుగ్రహించే కామధేనువులాంటి గో సంరక్షణకు పాటుపడటమే కాకుండా, అదేరీతిలో గోమాత సేవలో తరించాల్సిందిగా హిందూ బంధువులందరికీ హంపీ విరూపాక్ష పీఠాధిపతి, జగద్గురు శ్రీ విద్యారణ్య భారతీస్వామి పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు సమీపంలోని నిడుముక్కల గ్రామంలో శ్రీ అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ మందిర నిర్వాహకుల ఆధ్వర్యంలో గోశాలకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యారణ్య భారతి అనుగ్రహ భాషణం చేస్తూ హైందవ ధర్మానికి పెట్టనికోటలాగా విరాజిల్లుతున్న మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రాచీనకాలం నుండి అందరిచేత పూజింపబడుతున్న గోసంతతి పరిరక్షణ, గోమాత సేవలో పాల్గొనడం ఈ దేశంలోని ప్రతిపౌరుడి కర్తవ్యమని స్వామీజీ ఉద్బోధించారు. గో సంతతి ఎక్కడైతే సంరక్షించబడుతుందో ఆ ప్రాంతం, ఆ దేశం కళకళలాడుతూ ఉంటుందని స్వామీజీ పేర్కొన్నారు. అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ మందిర నిర్వాహకులు ఎం పార్ధసారధి, ప్రధాన అర్చకస్వామి మర్రిపాటి ప్రసాద్, శ్రీనుల ఆధ్వర్యంలో ఈ విశేషమైన కార్యక్రమం జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గోశాలకు హంపీపీఠాధిపతి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా నగరంలోని అష్టలక్ష్మీ దేవాలయం నుండి వందలాది మంది మహిళలు వెంటరాగా 108 మంది ముతె్తైదువులు కలశాలను ధరించి నిడుముక్కల గ్రామానికి తరలివచ్చారు. అంతకుముందు శ్రీ మహాగణపతి హోమం తదితర ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలను హంపీ విరూపాక్ష పీఠ సంప్రదాయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.