ఆంధ్రప్రదేశ్‌

రెండో గనిలో యురేనియం వెలికితీత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 16: కడప జిల్లా వేముల మండలంలోని యురేనియం ప్లాంట్ రెండవ గని నుంచి ముడి యురేనియం వెలికితీతకు రంగం సిద్ధమైంది. వేముల మండలం రాచగుంటపల్లె రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ముడి యురేనియం వెలికి తీసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేముల మండలం ఎం.తుమ్మలపల్లెలో 2012 ఏప్రిల్ 20న ముడి యురేనియం వెలికితీసే పనులు ప్రారంభమయ్యాయి. ఎం.తుమ్మలపల్లె వద్ద 2004లో తవ్వకాలు చేపట్టేందుకు అనుమతులు పొంది 2006లో ప్రజాభిప్రాయం సేకరించారు. అప్పట్లో ప్రజలు భూములు ఇచ్చేందుకు ఎగబడి ముందుకొచ్చారు. క్రమేపి రకరకాల జబ్బులు సోకుతున్నాయని, భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని భయాందోళనలు వ్యక్తం కావడంతో రైతులు ఆ తరువాత వెనక్కు తగ్గారు. 2006లో యురేనియం ఉత్పత్తి నిమిత్తం 1050 ఎకరాల ప్రభుత్వ భూమిని యుసిఐఎల్‌కు అప్పగించగా తుమ్మలపల్లె ప్రాంతంలో 580 ఎకరాలు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండవ గని నుంచి యురేనియం వెలికితీయాలంటే మరో 430 ఎకరాల భూమి ఎం.తుమ్మలపల్లె పరిసర ప్రాంతంలోని రైతాంగం నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాంత రైతులు భూములు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
దీంతో ఏంచేయాలో తెలియక అధికారులు తలపట్టుకోగా తాము భూములు ఇస్తామంటూ రాచగుంటపల్లె రైతాంగం ముందుకొచ్చింది. దీంతో యుసిఐఎల్ అధికారులు రాచగుంటపల్లెలోని పొలాలను పరిశీలించగా అక్కడ ముడి యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఎం.తుమ్మపల్లెలో భూగర్భం నుంచి రోజుకు 3 వేల టన్నుల ముడిఖనిజాన్ని వెలికితీసి శుద్దిచేస్తున్నారు. ఇక్కడ శుద్దిచేసిన యురేనియాన్ని హైదరాబాద్‌లోని ఎన్‌ఎఫ్‌డి (న్యూక్లియర్ క్యూయల్ కాంప్లెక్స్‌కు) తరలిస్తున్నారు. ప్రస్తుతం ఎం.తుమ్మలపల్లెలో 48.44 టన్నుల యురేనియం ముడిసరుకు ఉన్నట్లు యూసిఐఎల్, ఎఎండిలు గుర్తించాయి. దీంతో వీలైనంత త్వరగా రెండవ గనిలో తవ్వకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.
రెండవ గనిలో తవ్వకాలు ప్రారంభిస్తే ఆ గని నుంచి రోజుకు 1500 టన్నుల ఖనిజాన్ని వెలికితీయవచ్చునని అధికారులు అంటున్నారు.

చిత్రాలు..గనుల్లోంచి వెలికితీసిన ముడి యురేనియం * యురేనియం ముడి ఖనిజం తవ్వుతున్న దృశ్యం