ఆంధ్రప్రదేశ్‌

సుప్రీం తీర్పుపై హర్షాతిరేకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 11: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రద్దు తీర్పును సుప్రీం కోర్టు ఉపసంహరించుకోవటంపై సర్వత్రా హర్షం వ్యక్తవౌతోంది. దీనిపై విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 2013లో దీన్ని రద్దు చేయడం వల్ల మెరిట్ విద్యార్థులకు ఇప్పటి వరకూ అన్యాయం జరిగిందన్నారు. సామాన్యులెవ్వరూ వైద్య విద్యను అభ్యసించలేకపోయారని పేర్కొన్నారు. ‘గతంలో నీట్‌లో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు మన రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లోని వైద్య విద్యాలయాల్లో సీట్లు వచ్చేవి. 2013లో నీట్ రద్దయిన తరువాత వైద్య విద్యను అభ్యసించాలన్న విద్యార్థుల ఆశలు నీరుగారాయి. గడచిన మూడేళ్లలో ప్రైవేటు మెడికల్ కళాశాలలు భారీగా డబ్బులు దండుకున్నాయ’ని వారన్నారు. ఒక్కో మెడికల్ కళాశాల సంవత్సరానికి 11 నుంచి 15 లక్షల రూపాయల వరకూ వసూలు చేసిందని పేర్కొన్నారు. విశాఖలోని ఓ మెడికల్ యూనివర్సిటీ సంవత్సరానికి 15 లక్షల రూపాయలు వసూలు చేసిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇందుకోసం బ్యాంకుల్లో రుణం తీసుకోవలసి వస్తోందని వారన్నారు. ఫీజులకు భయపడి వైద్య విద్యను వదులుకుంటున్నారన్నారు. అలాగే నీట్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఎ, బి, సి కేటగిరిలుగా విభజించడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఉండేదని, దాన్ని కూడా ఇప్పుడు తొలగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు.