ఆంధ్రప్రదేశ్‌

ఆర్చరీ పోటీల్లో మెరిసిన తెలుగు తేజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 17: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక హిందూ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు విద్యార్థులు మెరిసారు. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో విజయవాడ కోనేరు లక్ష్మయ్య విశ్వ విద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి వి జ్యోతి సురేఖ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. డబుల్ 50 (5-+50) విభాగంలో 682 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఆమె శనివారం జరగనున్న ఒలింపిక్ రౌండ్‌కు అర్హత సంపాదించింది. పంజాబీ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్నేహల్ 669 పాయింట్లతో రజత పతకం దక్కించుకోగా గురునానక్ దేవ్ విశ్వ విద్యాలయం విద్యార్థిని దుర్గావతి కుమారి 664 పాయింట్లతో మూడవ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. వీరితో పాటు మరో తెలుగు అమ్మాయి ఉస్మానియా విశ్వ విద్యాలయం తరఫున పోటీ చేస్తున్న ఎస్ హిమాని 10వ ర్యాంక్, కృష్ణా విశ్వ విద్యాలయం తరఫున పోటీ చేస్తున్న అనూష రెడ్డి 14వ ర్యాంక్‌లో నిలిచారు. గురువారం కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో ద్వితీయ ర్యాంక్ సాధించిన కృష్ణా విశ్వ విద్యాలయం ఆర్చర్ నవీన్ కుమార్ శనివారం జరగనున్న సెమీ ఫైనల్ చేరుకున్నాడు.