ఆంధ్రప్రదేశ్‌

ఫలించిన శిద్ధా ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు కృషి ఫలితంగా గ్రానైట్‌పై భారం తగ్గింది. ప్రభుత్వం ఈ మేరకు జిల్లా ఖనిజాభివృద్ధి నిధి (డిఎంఎఫ్)ని 12.5 శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిఎంఎఫ్‌ను తగ్గించాలని కోరుతూ గ్రైనైట్ వ్యాపారులు నెల రోజల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మంత్రి శిద్దా రంగ ప్రవేశం చేసి గ్రానైట్ వ్యాపారులతో చర్చించారు. రెండు సార్లు ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి సమస్యను బాబు దృష్టికి తీసుకువచ్చారు. ఫలితంగా డిఎంఎఫ్ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం సీనరేజితో పాటు డిఎంఎఫ్ చెల్లించాలంటే భారంగా పరిణమిస్తోందంటూ గ్రానైట్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం దృష్టికి ఈ అంశాన్ని మంత్రి పీతల సుజాత సహా శిద్దా తీసుకువెళ్లడంతో ఎంత మేరకు తగ్గించగలమంటూ సిఎం అధికారులను కోరారు. మైనింగ్ అధికారులు 30 శాతాన్ని 20 శాతం చేయాలని కోరగా, సిఎం మాత్రం 12.5 శాతం నిర్ణయించారు.