ఆంధ్రప్రదేశ్‌

మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ కథనాలకు పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: మార్చి 8న జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఉత్తమ కథనాలకు సంబంధించి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సమాజంలో మహిళల స్థితిగతులపై సామాజిక సందేశంతో రూపొందించిన లఘుచిత్రాల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించారు. 2016 ఏప్రిల్ నుంచి 2017 జనవరి వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమైన, టీవీ ఛానళ్లలో ప్రసారమైన కథనాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేయడానికి ఎంట్రీలు పంపించాల్సిందిగా సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎంట్రీల నుంచి ఎంపిక అయిన ఉత్తమ కథాంశాలకు మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలను అందజేయనున్నట్లు ఆయన వివరించారు. 2016 ఏప్రిల్ 2017 జనవరి మధ్య ప్రసారం/ప్రచురణ అయిన కథనాలకు సంబంధించిన క్లిప్పింగులు, సీడీలను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, స్టేట్ హౌస్ కాంపౌండ్, గోపాల్‌రెడ్డి రోడ్డు, విజయవాడ-520002 అడ్రస్‌కు పంపాల్సిందిగా కమిషనర్ కోరారు.