ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో మరిన్ని ఐటి కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎనిమిది ఐటి కంపెనీలు శుక్రవారం ప్రారంభమ కావటం శుభసూచకమని, రాబోయే కాలంలో అమరావతిలో మరిన్ని ఐటి కంపెనీలు రానున్నాయని సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. శుక్రవారం విజయవాడ ఆటోనగర్‌లోని ఇండ్‌వెల్ టవర్స్‌లో ఐటి సర్వీస్ టెక్ పార్క్ ప్రారంభం సందర్భంగా దాన్ని సందర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఐటి సర్వ్ అలయన్స్ ఆధ్వర్యంలో 8 ఐటి కంపెనీలు ఇండ్‌వెల్ టవర్స్‌లో ప్రారంభమవడం హర్షణీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇవి కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు కావలసిన సాంకేతికతను అందించడానికి ఇవి తోడ్పాటునందిస్తాయని తెలిపారు. విశాఖపట్నంలో 9 ఐటి కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. రోబోటెక్స్, బ్లాక్‌చైన్, టెక్నాలజీ లాంటి కోర్సులకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాముఖ్యంతోపాటు ఎలక్ట్రానిక్స్‌కు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఐటి కంపెనీలు పెట్టాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చేయూతనందిస్తుందని తెలిపారు. ఈ-ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ కింద ఫోన్, నెట్, టివిలకు సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని అమరావతిలో ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్త టెక్నాలజీతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. రాబోయే కాలంలో అమరావతి రాజధానిలో వేల మంది ఐటి నిపుణలను తయారుచేసే కేంద్రంగా వృద్ధి చెందుతుందన్నారు. మంత్రితో పాటు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, ఐటి సర్వ్ అలయన్స్ సిఇవో రవి , ఐటి ఉద్యోగులు, 8 కంపెనీల డైరెక్టర్లు పాల్గొన్నారు.