ఆంధ్రప్రదేశ్‌

అందరికీ అక్షింతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 17: నేతల క్రమశిక్షణా రాహిత్యం, కుమ్ములాటలు, ప్రతిపక్షాలపై విమర్శల్లో నిర్లిప్తత, జిల్లా నేతల వైఫల్యాలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్షింతలు వేశారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన పార్టీ వర్క్‌షాప్‌లో బాబు సుదీర్ఖ సమయం కేటాయించారు. జిల్లాల వారీగా బృందాలుగా విభజించి చర్చలు జరిపించారు. ఈ సందర్భంగా బాబు పార్టీ నేతల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీలు ఎక్కడికి వెళ్లినా నలుగురు కలిసే వెళతారని అందువల్ల వారి మధ్య మనస్పర్ధలు తీసుకురావడానికి అవకాశం లేదని, పార్టీ నేతలు కూడా అదేవిధంగా కలసి ఉండాలని సూచించారు. దానికి స్పందించిన పలువురు జిల్లా నేతలు తామంతా కలిసే ఉన్నామని చెప్పగా, జోక్యం చేసుకున్న బాబు నిజం చెప్పండి తమ్ముళ్లూ.. మీరు ఏం చేస్తున్నారో నాకు అంతా తెలుసంటూ నవ్వారు. నేతల్లో అహంకారం, మితిమీరిన ఆత్మవిశ్వాసం పనికిరాదని క్లాసు పీకారు. జనం అన్నీ గమనిస్తున్నారని, పనిచేయకపోతే కులం, మతం పనికిరాదని, చివరకు బంధువులు కూడా ఓట్లు వేయరని చురకలంటించారు. ఇప్పటివరకూ తాను ప్రభుత్వానికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, ప్రజల్లో కూడా 80 శాతం సంతృప్తి శాతం పెరిగిందని గుర్తు చేశారు. అందువల్ల తాను ఇకపై రోజూ గంట పార్టీకి కేటాయిస్తానని చెప్పారు. కొత్తవారిని విస్మరించకూడదని, ఈ విషయంలో ఇటీవలే పార్టీలో చేరిన చెంగల్రాయుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజలకు దూరమైతే దెబ్బతింటారని, అలాగే మీడియా పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు. మీరు మీరు కొట్లాడుకుని అది పార్టీకి ఆపాదిస్తే అంతా నష్టపోతారని హెచ్చరించారు. మంత్రులు అందరినీ సమన్వయం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా మంత్రులు జిల్లాలకు వెళ్లే 48 గంటల ముందు వారి పర్యటన వివరాలు జిల్లా నేతలకు ఇవ్వాలని, దానివల్ల జిల్లాలో సమస్యలు వివరించేందుకు కార్యకర్తలకు అవకాశం ఉంటుందన్నారు. నాలుగు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య జరుగుతున్న కుమ్ములాటలను ప్రస్తావిస్తూ, ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. ఎవరూ మరొకరి నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఏడాది చివరికల్లా అన్ని జిల్లాల్లో పార్టీ ఆఫీసులు నిర్మించుకోవాలని సూచించారు. తాను కష్టపడి ఫలితాలు ఆశిస్తానని, నేతలు కూడా అదేవిధంగా పనిచేయాలన్నారు. కార్యకర్తలను విస్మరిస్తే నష్టపోతారని హెచ్చరించారు. కాగా, వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, అందువల్ల కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని సమన్వయం చేసుకొని వెళ్లాలని చెప్పారు. ఏపిలో జరుగుతున్న సంక్షేమపథకాలు ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.
నేతలతో సరదాగా బాబు
కాగా ఉదయం నుంచి రాత్రి వరకూ సుదీర్ఘంగా సాగిన వర్క్‌షాప్‌లో నేతలకు క్లాసు పీకిన బాబు, భోజన సమయంలో వారితో సరదాగా మాట్లాడారు. తాను ప్రత్యేకంగా వేరే గదిలో భోజనం చేయకుండా ప్లేటు పట్టుకుని నేతలతో కలసి తింటూ కబుర్లు చెప్పారు.

ఆకట్టుకున్న లోకేష్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్
ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టిడిపి కోర్ డాష్ బోర్డుపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. పార్టీ కార్యక్రమాలు, కమిటీలు, జిల్లాల్లో పార్టీ నేతలు మీడియాకు సంబంధించి చేసిన ఎదురుదాడి తదితర అంశాలను లోకేష్ చూపించారు. అనంతపురం జిల్లాలోనే ఎక్కువ వ్యతిరేక కథనాలు వస్తున్నాయని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపరుచుకునేందుకు డాష్ బోర్డు ఒక మార్గదర్శిలా పనిచేస్తుందన్నారు. ఏదైనా సిఫార్సులు చేసినప్పుడు ఒకరి పేరు కాకుండా రెండు పేర్లు ఇవ్వాలని సూచించారు. రోజూ తాము సూచించే అంశాలను అనుసరించడం ద్వారా స్థానికంగా పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. కాగా లోకేష్ కూడా సాధారణ నాయకుడి మాదిరిగానే కింద కూర్చుని ప్రసంగాలు ఆలకించారు. అంతకుముందు.. పార్టీ జెండా ఆవిష్కరణకు చంద్రబాబు హాజరయ్యే సమయంలో మంత్రులంతా హాల్‌లోపల ఉండటాన్ని గమనించిన లోకేష్, స్వయంగా లోపలికి వచ్చి ‘అన్నా సార్ వస్తున్నారు రండి’ అని వారిని బయటకు తీసుకువెళ్లడం కనిపించింది.

చిత్రం..పార్టీ వర్క్‌షాప్‌లో అందరితో కలిసి ప్లేటులో భోజనం పెట్టించుకుంటున్న ముఖ్యమంత్రి