ఆంధ్రప్రదేశ్‌

యుపిలో ఓట్లు దండుకోవడానికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఫిబ్రవరి 17 : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు దండుకోవడానికే ప్రధాని నరేంద్రమోదీ రైతులకు రుణమాఫీ ప్రకటన చేశారని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిరలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఓటమి బాటలో ఉన్న నేపథ్యంలో అధికారం చేజిక్కుంచుకోవడానికి రుణమాఫీ ప్రకటన చేసిందన్నారు. అయినా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతారన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు కరవుతో అల్లాడుతుంటే ఒక్క ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే రైతుల రుణమాఫీ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు మన రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని ప్రధానికి వివరించి రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయించాలని డిమాండ్ చేశారు. జమ్మూకాశ్మీర్‌లో రూ.80 లక్షల కోట్లు, బీహార్‌లో రూ.1.25 లక్షల కోట్ల ఎన్నికల హామీలు నేటికీ అమలు కాలేదన్నారు. పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోదీ మోసం చేసిన విషయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ అక్కడి ప్రజలకు తెలిపారన్నారు. యుపిలో బిజెపి ఓటమి అంచులో ఉందన్నారు. ప్రధాని మతిభ్రమించి మాట్లాడుతూ, ప్రధాని పదవి స్థాయిని దిగజారుస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు సమాజ్‌వాదీ పార్టీకి కొమ్ముకాస్తున్నారని ప్రధాని పేర్కొనడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద అవినీతి పరుడని, అతనిపై పలు కేసులు ఉన్నాయన్నారు. వాటినుండి బయటపడడం చేతకాక ఇతర పార్టీల నేతలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తమిళనాడు అన్నాడిఎంకె నాయకురాలు శశికళను అవినీతిపరులని విమర్శించడం తగదన్నారు. చంద్రబాబు నీతిమంతుడుగా నిరూపించుకుని ఆ తర్వాతే ఇతరులపై విమర్శలు చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు సొరంగాల నాగరాజు, మంజునాథ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.