ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మకు ఆన్‌లైన్‌లో కానుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ( ఇంద్రకీలాద్రి) ఫిబ్రవరి 17: విజయవాడ కనకదుర్గమ్మకు భక్తులు ఆన్‌లైన్ విధానంలో నేరుగా ఆన్‌లైన్‌లో ‘కానుకలు’ పంపే విధంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం నుండి భక్తులు ఆన్‌లైన్ విధానంలో వేగంగా, సౌకర్యవంతంగా వారికి అనువైన సమయంలో డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానానికి ఈ విరాళాలను పంపే విధంగా చర్యలు చేపట్టారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఒప్పందాల్లో భాగంగా ఎలక్ట్రానిక్ క్యాష్ మేనేజ్‌మెంట్ వేదికను భక్తులు తమ విరాళాల చెల్లింపును ఆర్‌టిజిఎస్, ఎస్‌ఇఎఫ్‌టి, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పంపుకోనే విధంగా అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెవిఎస్ ప్రసాద్, దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి, హెచ్‌డిఎఫ్‌సి క్లస్టర్ హెచ్‌సి పవన్‌కుమార్, తదితరుల సమక్షంలో ఈనూతన సేవలు ప్రారంభమైయ్యాయి.