ఆంధ్రప్రదేశ్‌

‘నవ’ నగరాలకు భూ కేటాయింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహానగరంలో అంతర్భాగంగా నిర్మించే 9 నగరాలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. అమరావతిలో అంతర్భాగంగా 9 నగరాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రధాన ఆకృతులను నార్మన్ పోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ ఈ నెల 22న ప్రభుత్వానికి అందజేయనుంది. ఈనేపథ్యంలో ఈ 9 నగరాలకు ప్రభుత్వం భూములను కేటాయించింది. పర్యాటక నగరం:పర్యాటక రంగానికి చెందిన కార్యాలయాలు, స్టార్ హోటళ్లు ఉంటాయి. ఈ నగరానికి కేటాయించిన మొత్తం 11,574 ఎకరాల్లో వినోద అవసరాలకు, ఇతరత్రా ప్రజల ఉపయోగాల కోసం బహిరంగ ప్రదేశంగా ఉంచడానికి 8,778 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 1397 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 451, పరిశ్రమలకు 100, ప్రత్యేక జోన్‌కు 156 ఎకరాలు కేటాయించారు. విజ్ఞాన నగరం:విశ్వవిద్యాలయాలు, టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. గృహావసరాలకు 3562 ఎకరాలు కేటాయించారు. వాణిజ్య అవసరాలకు 1257 ఎకరాలు, ప్రత్యేక జోన్‌కు 979, పరిశ్రమలకు 87, భవిష్యత్ అవసరాల కోసం 1322 ఎకరాలు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ నగరం:ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 6,582 ఎకరాలు కేటాయించారు. ఇందులో గృహావసరాలకు 1862 ఎకరాలు, పారిశ్రామిక రంగానికి 1618, వినోదం, ఇతర ప్రయోజనాల కోసం 757, వాణిజ్య అవసరాలకు 682, ప్రత్యేక జోన్‌కు 645 కేటాయించారు.
ఆరోగ్య నగరం:ప్రభుత్వాసుపత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులు, వైద్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఈ నగరానికి 6,511 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 3,306 ఎకరాలు, భవిష్యత్ అవసరాలకు 1072, ప్రత్యేక జోన్‌కు 1048, వాణిజ్య అవసరాలకు 504 ఎకరాలు కేటాయించారు.
ఆర్థిక నగరం:ఆర్థిక శాఖకు చెందిన ప్రభుత్వ సంస్థలతో పాటు ఇతర ఆర్థిక సంస్థల కార్యాలయాలు ఉంటాయి. ఈ నగరానికి 5,168 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 1389 ఎకరాలు, వినోదం, ప్రత్యేక జోన్లు 844, వాణిజ్య అవసరాలకు 828, భవిష్యత్ అవసరాలకు 756, పారిశ్రామిక రంగానికి 101 ఎకరాలు కేటాయించారు.
క్రీడల నగరం:క్రీడా మైదానాలతోపాటు ఆ శాఖకు చెందిన పరిపాలన కార్యాలయాలు ఇందులో ఉంటాయి. ఈ నగరానికి 4,150 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 1819 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 513, ప్రత్యేక జోన్లకు 436, పారిశ్రామిక అవసరాలకు 134 ఎకరాలు కేటాయించారు.
న్యాయ నగరం:హైకోర్టుతోపాటు ఇతర న్యాయస్థానాలు, పరిపాలనా కార్యాలయాలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి ఆ శాఖకు చెందిన ఉద్యోగుల నివాస గృహాలు ఉంటాయి. ఈ నగరానికి 3,438 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 1276 ఎకరాలు, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు 692, వాణిజ్య అవసరాలకు 467, ప్రత్యేక జోన్లకు 458 ఎకరాలు కేటాయించారు.
మీడియా నగరం:ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియాలకు చెందిన కార్యాలయాలు, ఆయా సంస్థల ఉద్యోగుల గృహాలు ఉంటాయి. ఈ నగరానికి 5,107 ఎకరాలు కేటాయించారు. గృహావసరాలకు 1862 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 791, ప్రత్యేక జోన్లకు 346, పారిశ్రామిక అవసరాలకు 250 ఎకరాలు కేటాయించారు.
పరిపాలన నగరం:శాసనసభ, శాసనమండలి, సచివాలయం, తదితర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. అయినా దీనికి అతి తక్కువగా 2,702 ఎకరాలు మాత్రమే కేటాయించారు. గృహావసరాలకు 833 ఎకరాలు, ప్రత్యేక జోన్లకు 638, వినోదం, ఇతర సామాజిక అవసరాలకు 567, వాణిజ్య కార్యకలాపాలకు 237 ఎకరాలు కేటాయించారు.

చిత్రం... నవ నగరాలకు ప్రభుత్వం జరిపిన
భూ కేటాయింపులు