ఆంధ్రప్రదేశ్‌

వారెంట్‌ను రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 11: మారిషస్ బ్యాంకు ఫిర్యాదు మేరకు నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయాలని కేంద్రమంత్రి సుజనా చౌదరి సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా సుజనా చౌదరి ఉన్నందున ఆయన పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా మారిషస్ బ్యాంకు ప్రయత్నిస్తోందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుజనా చౌదరి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో రివ్యూ పిటీషన్ దాఖలు చేసినందున, ఆ పిటీషన్‌పై స్పష్టత వచ్చే వరకూ హైకోర్టు ఎన్‌బిడబ్ల్యూ సహా మిగిలిన అన్ని ప్రొసిండింగ్స్‌ను నిలిపి వేసే విధంగా ఆదేశించాలని కోరారు.